టీమిండియా ఘన విజయం | ICC Womens T20 World Cup 2026: India vs Pakistan match updates | Sakshi
Sakshi News home page

IND-W Vs PAK-W: టీమిండియా ఘన విజయం

Jun 14 2026 6:35 PM | Updated on Jun 14 2026 10:43 PM

ICC Womens T20 World Cup 2026: India vs Pakistan match updates

పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్‌
మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేయగా.. దీప్తి శర్మ  (4-0-10-5) మాయాజాలానికి పాక్‌ 106 పరుగులకే చాపచుట్టేసింది. భారత్‌ తరఫున బ్యాటింగ్‌లో మంధాన (68) రాణించగా.. ఆఖర్లో రిచా ఘోష్‌ (34 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించింది. 

ఓటమి దిశగా పాక్‌
75 పరుగుల వద్ద నాలుగు పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయిన పాక్‌.. ఓటమి దిశగా సాగుతోంది. 75 పరుగుల వద్ద మునీబా అలీని (41) దీప్తి శర్మ అద్భుతమైన డైరెక్ట్‌ త్రోతో రనౌట్‌ చేయగా.. 77 పరుగుల వద్ద ఫాతిమా సనాను (0) షఫాలీ, 79 పరుగుల వద్ద నతాలియాను (7) శ్రీ చరణి ఔట్‌ చేశారు. 13 ఓవర్ల తర్వాత పాక్‌ స్కోర్‌ 83-6గా ఉంది. ఆలియా రియాజ్‌ (4), రమీన్‌ షమీమ్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. 

మూడో వికెట్‌ కోల్పోయిన పాక్‌
7.4వ ఓవర్‌- 58 పరుగుల వద్ద పాక్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. శ్రీచరణి బౌలింగ్‌లో హర్మన్‌ప్రీత్‌కు క్యాచ్‌ ఇచ్చి సైరా జబీన్‌ (2) ఔటైంది. 

రెండో వికెట్‌ కోల్పోయిన పాక్‌
6.3వ ఓవర్‌- 53 పరుగుల వద్ద పాక్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. దీప్తి శర్మ బౌలింగ్‌లో స్మృతి మంధనకు క్యాచ్‌ ఇచ్చి అయేషా జాఫర్‌ (12) ఔటైంది.

ఇండియాకు తొలి బ్రేక్‌
171 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్‌కు మెరుపు ఆరంభం​ లభించింది. 4.4 ఓవర్లలో ఆ జట్టు ఓపెనర్లు మునీబా అలీ (24), గుల్‌ ఫెరోజా (12) 38 పరుగులు చేశారు. అయితే 4.5వ ఓవర్‌లో భారత్‌కు తొలి బ్రేక్‌ లభించింది. ఫెరోజాను దీప్తి శర్మ ఇంటిదారి పట్టించింది. భారతి ఫుల్మలి అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో ఇది జరిగింది. 

గౌరవప్రదమైన స్కోర్‌ సాధించిన టీమిండియా
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగుల గౌరవప్రదమైన స్కోర్‌ చేసింది. ఓపెనర్‌ స్మృతి మంధాన (68) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో రాణించింది. ఆమెకు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (36) సహకరించింది. 

ఆఖర్లో రిచా ఘోష్‌ (34 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించింది. మిగతా బ్యాటర్లలో దీప్తి శర్మ 12 (నాటౌట్‌), షఫాలీ వర్మ 6, జెమీమా రోడ్రిగ్స్‌ 1, భారతి ఫుల్మాలి 1, శ్రేయాంక పాటిల్‌ 1 (నాటౌట్‌) పరుగు చేశారు. ఆపఖ​ బౌలర్లలో కెప్టెన్‌ ఫాతిమా సనా, సదియా ఇక్బల్‌ తలో 2 వికెట్లు తీయగా.. తస్మియా రుబాబ్‌, రమీన్‌ షమీమ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. 

ఐదో వికెట్‌ కోల్పోయిన భారత్‌
16.2వ ఓవర్‌- 123 పరుగుల వద్ద భారత్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. ఫాతిమా సనా బౌలింగ్‌లో నతాలియాకు క్యాచ్‌ ఇచ్చి హర్మన్‌ప్రీత్‌ (36) ఔటైంది. 

👉 సాదియా ఇక్బాల్‌ బౌలింగ్‌లో భారతీ ఫుల్మలీ (1) స్టంప్‌ ఔట్‌ కావడంతో 110 పరుగుల వద్ద భారత్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది.

మంధాన (68) ఔట్‌.. మూడో వికెట్‌ డౌన్‌
ధాటిగా ఆడుతున్న మంధాన (68) రూపంలో టీమిండియా 109 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. రమీన్‌ సమీమ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన మంధాన ఫాతిమా సనాషేక్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగింది. 

హాఫ్‌ సెంచరీ బాదిన  మంధాన
పాక్‌తో మ్యాచ్‌లో ఓపెనర్‌ స్మృతి మంధాన హాఫ్ సెంచరీతో చెలరేగింది. 34 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ సాధించిన మంధాన ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. 12 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. మంధాన (55), హర్మన్‌ప్రీత్ (21) పరుగులతో ఆడుతున్నారు.

9 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ ఎంతంటే..?
18 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత్‌ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతుంది. ‍స్మృతి మంధన (28), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (17) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతున్నారు. 9 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్‌ 54-2గా ఉంది. 

రెండో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
3.2వ ఓవర్‌- 18 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. తస్మియా రుబాబ్‌ బౌలింగ్‌లో నతాలియా పర్వేజ్‌ క్యాచ్‌ పట్టడంతో జెమీమా రోడ్రిగ్స్‌ (1) పెవిలియన్‌కు చేరింది. 

తొలి బంతికే సిక్సర్‌.. ఐదో బంతికి వికెట్‌
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌కు మెరుపు ఆర​ంభం లభించింది. ఇన్నింగ్స్‌ తొలి బంతికే సదియా ఇక్బాల్‌ బౌలింగ్‌లో షఫాలీ వర్మ సిక్సర్‌ కొట్టింది. అయితే అదే ఓవర్‌ ఐదో బంతికి మునీబా అలీకి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరింది. 

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026లో ఇవాళ (జూన్‌ 14) బిగ్‌ ఫైట్‌ జరుగనుంది. దాయాదులు భారత్‌, పాకిస్తాన్‌ ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లోనూ భారత, పాక్‌ కెప్టెన్లు నో హ్యాండ్‌ షేక్‌ ఆనవాయితీని కొనసాగించారు. 

తుది జట్లు:
భారత్‌: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), భారతీ ఫుల్మాలి, రిచా ఘోష్ (w), దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్

పాకిస్తాన్‌: గుల్ ఫిరోజా, మునీబా అలీ(w), అయేషా జాఫర్, సైరా జబీన్, అలియా రియాజ్, నటాలియా పర్వైజ్, ఫాతిమా సనా(c), రమీన్ షమీమ్, నష్రా సంధు, తస్మియా రుబాబ్, సదియా ఇక్బాల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement