బంగ్లాదేశ్‌పై టీమిండియా గెలుపు | ICC Womens T20 World cup 2026: India vs bangladesh match updates | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌పై టీమిండియా గెలుపు

Jun 25 2026 6:41 PM | Updated on Jun 25 2026 10:23 PM

ICC Womens T20 World cup 2026: India vs bangladesh match updates

బంగ్లాదేశ్‌పై టీమిండియా 5 వి​కెట్ల తేడాతో గెలుపు
137 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా.. షఫాలీ వర్మ (53) విధ్వంసకర అర్ద శతకంతో చెలరేగడంతో 16.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. షఫాలీతో పాటు యస్తికా భాటియా (23), జెమీమా రోడ్రిగ్స్‌ (26) బ్యాట్‌ ఝులిపించారు. 

మిగతా భారత బ్యాటర్లలో మంధాన 8, రిచా ఘోష్‌ 10, కెప్టెన్‌ హర్మన్‌ 13 (నాటౌట్‌), దీప్తి శర్మ 5 (నాటౌట్‌) పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో రితూ మోనీ 2 వికెట్లు తీయగా.. మరుఫా, రబేయా ఖాన్‌, నహిద తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

ఈ గెలుపుతో భారత్‌ సెమీస్‌ అవకాశాలను మెరుగుపర్చుకుంది. తమ చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో భారత్‌ ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ జూన్‌ 28 లార్డ్స్‌లో జరుగనుంది. ఈ మ్యాచ్‌ గెలిస్తే భారత్‌ దర్జాగా సెమీస్‌కు చేరుకుంటుంది. 

గ్రూప్‌-ఏ నుంచి ఆస్ట్రేలియా ఇదివరకే సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది (అనధికారికంగా). రెండో బెర్త్‌ కోసం భారత్‌, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌ పోటీలో ఉన్నాయి. ఈ గ్రూప్‌ నుంచి పాక్‌, నెదర్లాండ్స్‌ ఇదివరకే సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించాయి. 

మరోవైపు గ్రూప్‌-బి నుంచి ఇంగ్లండ్‌ సెమీస్‌ బెర్త్‌ అధికారికంగా ఖరారు చేసుకుంది. రెండో బెర్త్‌ కోసం వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌, శ్రీలంక పోటీపడుతున్నాయి. ఈ గ్రూప్‌లో స్కాట్లాండ్‌, ఐర్లాండ్‌ ఇదివరకే సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించాయి. 

షఫాలీ ఔట్‌
8.4వ ఓవర్‌- 76 పరుగుల వద్ద భారత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. నహిద అక్తర్‌ బౌలింగ్‌లో నిగార్‌ సుల్తానా స్టంపింగ్‌ చేయడంతో షఫాలీ వర్మ (53) ఔటైంది.

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ ఔట్‌
2.6వ ఓవర్‌- 137 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన (8) మూడో ఓవర్‌లోనేచ ఔటైంది. మరుఫా అక్తర్‌ బౌలింగ్‌లో రబేయా ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి మంధాన పెవిలియన్‌ బాట పట్టింది. 3 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 31-1గా ఉంది. మంధాన ఔటైనా మరో ఓపెనర్‌ షఫాలీ వర్మ (22) ధాటిగా ఆడుతుంది. 

స్వల్ప స్కోర్‌కే పరిమితమైన బంగ్లాదేశ్‌
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ టీమిండియా బౌలర్ల ధాటికి స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

మూడో వికెట్‌ కోల్పోయిన బంగ్లాదేశ్‌
12.5వ ఓవర్‌- 79 పరుగుల వద్ద బంగ్లాదేశ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. రాధా యాదవ్‌ బౌలింగ్‌లో దీప్తి శర్మకు క్యాచ్‌ ఇచ్చి శోభన మోస్తరి (22) ఔటైంది. 

రెండో వికెట్‌ కోల్పోయిన బంగ్లాదేశ్‌
8.5వ ఓవర్‌- 59 పరుగుల వద్ద బంగ్లాదేశ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. జుయారియా ఫెర్దోస్‌ (33) నందిని శర్మ బౌలింగ్‌లో క్యాచ్‌ అండ్‌ బౌల్డ్‌ అయ్యింది. 

తొలి వికెట్‌ కోల్పోయిన బంగ్లాదేశ్‌
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ రెండో ఓవర్‌లోనే వికెట్‌ కోల్పోయింది. రేణుకా సింగ్‌ బౌలింగ్‌లో శ్రీ చరణికి క్యాచ్‌ ఇచ్చి దిల్హర అక్తర్‌ (4) ఔటైంది. 3 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్‌ స్కోర్‌ 12-1గా ఉంది. 

బంగ్లాదేశ్‌తో కీలక సమరం.. టాస్‌ ఓడిన టీమిండియా
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026లో ఇవాళ (జూన్‌ 25) కీలక మ్యాచ్‌ జరుగనుంది. మాంచెస్టర్‌ వేదికగా భారత్‌,బంగ్లాదేశ్‌ తలపడనున్నాయి. గ్రూప్‌-ఏ నుంచి సెమీస్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌ ఇరు జట్లకు చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.

తుది జట్లు..
భారత్‌: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తికా భాటియా, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), రిచా ఘోష్ (w), దీప్తి శర్మ, రాధా యాదవ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్, నందిని శర్మ

బంగ్లాదేశ్: దిల్హర అక్తర్, జువైరియా ఫిర్దౌస్, షర్మిన్ అక్తర్, నిగర్ సుల్తానా(w/c), శోభనా మోస్తరీ, రీతు మోని, షోర్నా అక్తర్, రబెయా ఖాన్, నహిదా అక్తర్, శంజిదా అక్తర్ మేఘలా, మరుఫా అక్తర్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement