పాక్ కంపెనీలో జాబ్.. రూ.2 కోట్ల ప్యాకేజీ! | Job at Pakistan Company Rs 2 Crore Salary Package | Sakshi
Sakshi News home page

పాక్ కంపెనీలో జాబ్.. రూ.2 కోట్ల ప్యాకేజీ!

Jul 13 2026 7:19 PM | Updated on Jul 13 2026 7:30 PM

Job at Pakistan Company Rs 2 Crore Salary Package

కరాచీకి చెందిన ఒక కంపెనీ నుంచి తనకు మంచి జీతంతో కూడిన జాబ్ ఆఫర్ వచ్చిందని పేర్కొంటూ 21 ఏళ్ల టెకీ ఆదిత్య పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఆన్‌లైన్‌లో చర్చనీయాంశమైంది. ఈ పోస్ట్ వైరల్ కావడంతో కొంతమంది ఆసక్తిగా స్పందించగా, మరికొందరు ఇది కేవలం సోషల్ మీడియా ఎంగేజ్‌మెంట్ కోసం చేసిన ప్రయత్నమా?.. అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు.

ఆదిత్య షేర్ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం.. కరాచీ కేంద్రంగా పనిచేస్తున్న ఓ కంపెనీ తనకు సంవత్సరానికి 1.8 లక్షల నుంచి 2.2 లక్షల డాలర్ల వరకు బేస్ శాలరీ ఆఫర్ చేసిందని తెలిపాడు. భారత కరెన్సీలో ఈ వేతనం దాదాపు రూ.2 కోట్లు. కంపెనీ హెడ్ క్వార్టర్ కరాచీలో ఉన్నప్పటికీ, ఎక్కువ మంది ఉద్యోగులు యూకే టైమ్ జోన్ ప్రకారం పనిచేస్తారని ఆఫర్ వివరాల్లో ఉన్నట్లు వెల్లడించాడు.

తనకు వచ్చిన ఈ ఆఫర్‌ను అంగీకరించి అక్కడికి వెళ్లాలా?, వద్దా? అని తన ఫాలోవర్లను అడుగుతూ ఆదిత్య తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

ఈ పోస్ట్ అతి తక్కువ సమయంలోనే వైరల్ అయింది. ఈ పోస్టును చూసినవారిలో.. కొంతమంది నిజంగానే ఇది మంచి కెరీర్ అవకాశం కావచ్చని చెప్పారు. మరికొందరు మాత్రం ఆ ఆఫర్ నిజమా, కాదా? అనే సందేహాలు వ్యక్తం చేశారు. ఇంకొంతమంది ఇలాంటి పోస్టులు కేవలం ఎక్కువ లైక్‌లు, కామెంట్లు, వ్యూస్ కోసం చేసి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఇలాంటి అవకాశాలను అంగీకరించే ముందు కంపెనీ వివరాలు, ఉద్యోగ నిజమైనదా కాదా అనే విషయాలను పూర్తిగా పరిశీలించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement