రూట్‌, డాసన్‌ అద్భుత పోరాటం​.. ఇంగ్లండ్‌ గౌరవప్రదమైన స్కోర్‌ | IND VS ENG 1st ODI: England all out for 258 batting first | Sakshi
Sakshi News home page

రూట్‌, డాసన్‌ అద్భుత పోరాటం​.. ఇంగ్లండ్‌ గౌరవప్రదమైన స్కోర్‌

Jul 14 2026 7:14 PM | Updated on Jul 14 2026 7:45 PM

IND VS ENG 1st ODI: England all out for 258 batting first

photo credit: ECB X

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్‌ జట్టు గౌరవప్రదమైన స్కోర్‌ చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆ జట్టు నిర్ణీత 47.5  ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది.

పేసర్లకు అనుకూలించిన పిచ్‌పై 107 పరుగులకే 6 వికెట్లు పోయిన ఇంగ్లండ్‌ ను జో రూట్‌ (76 నాటౌట్‌), లియామ్‌ డాసన్‌ (68) అదుకున్నారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌కు జీవం పోశారు.

అంతకుముందు ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ (43) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌ ఆడాడు. మిగతా ప్లేయర్లలో జేకబ్‌ బేతెల్‌ 14, కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ 1, జోస్‌ బట్లర్‌ 5, సామ్‌ కర్రన్‌ డకౌట్‌, విల్‌ జాక్స్‌ 20, జోఫ్రా ఆర్చర్‌12, ఆదిల్‌ రషీద్‌ 1, టంగ్‌ డకౌటాయ్యారు.

భారత బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ 4 వికెట్లు తీయగా.. ప్రసిద్ద్‌ కృష్ణ, గుర్నూర్‌ బ్రార్‌ తలో 2, బుమ్రా, దూబే తలో వికెట్‌ తీశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement