Dawson
-
10,000 రన్స్.. 380 వికెట్లు! రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్
ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ లియామ్ డాసన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి తక్షణమే తప్పుకుంటున్నట్లు డాసన్ ప్రకటించాడు. 36 ఏళ్ల డాసన్.. తన వైట్ బాల్ కెరీర్‌ను మరింత కాలం పొడిగించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. డాసన్ తన 19 ఏళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో 200 మ్యాచ్‌లు హాంప్‌షైర్ క్రికెట్ క్లబ్ తరపున ఆడాడు.2026 కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా హాంప్‌షైర్ ఆడిన మొదటి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో డాసన్ పాల్గోన్నాడు. కానీ టోర్నమెంట్ మధ్యలోనే అతడు తప్పుకోని అందరికి షాకిచ్చాడు. అయితే న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు ఇంగ్లండ్ జట్టు ప్రకటించిన కొద్ది గంటల్లోనే డాసన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.వైట్ బాల్ క్రికెట్‌పై దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు డాసన్ చెబుతున్నప్పటికి, టెస్టు జట్టులో చోటు దక్కకపోవడంతోనే రెడ్ బాల్ క్రికెట్‌కు అతడు వీడ్కోలు పలికాడని ఇంగ్లండ్ క్రికెట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది."నేను ఫస్ట్-క్లాస్ క్రికెట్ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. ఇది నేను తేలికగా తీసుకున్న నిర్ణయం కాదు.వైట్-బాల్ క్రికెట్లో నా కెరీర్‌ను మరింత కాలం కొనసాగించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. హాంప్‌షైర్ తరపున 200కు పైగా మ్యాచ్‌లు ఆడటం నాకు ఎంతో గర్వకారణం. ఈ క్రికెట్ క్లబ్‌తో నాకు ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ 19 ఏళ్ల ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు అని డాసన్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. తన ఫస్ట్‌క్లాస్ క్రికెట్ కెరీర్లో 218 మ్యాచ్‌లు ఆడిన డాసన్.. 10828 పరుగులతో పాటు 380 వికెట్లు పడగొట్టాడు. అతడి పేరిట 18 ఫస్ట్ క్లాస్ సెంచరీలు ఉన్నాయి. ఇంగ్లండ్ తరపున 4 టెస్టులు ఆడిన డాసన్.. కేవలం 8 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. -
37 ఏళ్ల రికార్డు బద్ధలైంది!
చెన్నై: భారత్ తో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్టులో ఇంగ్లండ్ క్రికెటర్ డాసన్ ఒక రికార్డును సవరించాడు. ఈ మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన డాసన్(66 నాటౌట్;148 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్) అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ దిగిన డాసన్ 60కు పైగా పరుగులు సాధించాడు. తద్వారా ఎనిమిదో వికెట్‌గా దిగి అరంగేట్రం టెస్టుల్లో ఇంగ్లండ్ తరపున అత్యధిక స్కోరు సాధించిన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పటివరకూ డేవిడ్ బెయిర్ స్టో(59)పేరిట ఉన్న రికార్డును బద్ధలు కొట్టాడు. 1979లో డేవిడ్ బెయిర్ స్టో తన అరంగేట్రం టెస్టులో ఎనిమిదో స్థానంలో దిగి అత్యధిక స్కోరు సాధించాడు. ఆ సమయంలో డేవిడ్ బెయిర్ స్టో సాధించిన రికార్డుకు కూడా భారత్‌పైనే కావడం విశేషం. తాజాగా ఆ స్కోరును డాసన్ అధిగమించడంతో 37 ఏళ్ల రికార్డు తెరమరుగైంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 477 పరుగుల భారీ స్కోరు సాధించింది. బెయిర్ స్టో(49), మొయిన్ అలీ(146)లు రాణించి ఇంగ్లండ్ భారీ స్కోరుకు బాటలు వేశారు. ఆ తరువాత డాసన్, రషిద్(60)లు హాఫ్ సెంచరీలతో మెరిసి ఇంగ్లండ్ ను మరితం పటిష్ట స్థితికి తీసుకెళ్లారు. ఈ జోడి ఎనిమిదో వికెట్‌కు 108 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది. దాంతో చెపాక్ స్టేడియంలో ఎనిమిదో వికెట్‌కు రెండో అత్యుత్తమ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఈ స్టేడియంలో అత్యుత్తమ భాగస్వామ ఎనిమిదో వికెట్ భాగస్వామ్యం ఇమ్రాన్ ఖాన్-వసీం అక్రమ్‌లు జంట పేరిట ఉంది. 1987లో ఇమ్రాన్-వసీంలు ఇక్కడ నమోదు చేసిన 112 పరుగులు నేటికీ అత్యుత్తమ భాగస్వామ్యం. -
ఇంగ్లండ్ జట్టులో రెండు మార్పులు
జట్టుతో చేరనున్న జెన్నింగ్స్, డాసన్ వోక్స్‌కు కూడా గాయం న్యూఢిల్లీ: భారత్‌తో చివరి రెండు టెస్టులకు గాను ఇంగ్లండ్ జట్టులోకి ఇద్దరు కొత్త ఆటగాళ్లను ఎంపిక చేశారు. గాయపడ్డ ఓపెనర్ హమీద్ స్థానంలో కీటన్ జెన్నింగ్‌స... స్పిన్నర్ అన్సారీ స్థానంలో ఆల్‌రౌండర్ లియామ్ డాసన్ జట్టుతో చేరనున్నారు. హమీద్ స్వదేశానికి వెళ్లగా... అన్సారీ మాత్రం జట్టుతో పాటే ఉండి చికిత్స తీసుకుంటాడు. ఐపీఎల్లో బెంగళూరు కోచ్‌గా పని చేస్తున్న రే జెన్సింగ్‌స కుమారుడు కీటన్ జెన్నింగ్‌స. ఈ రెండు మార్పులను ప్రకటించిన తర్వాత ఇంగ్లండ్‌కు మరో షాక్ తగిలింది. ఆల్‌రౌండర్ వోక్స్ బొటనవేలి గాయం తీవ్రమైంది. దీంతో తను నాలుగో టెస్టుకు అందుబాటులో ఉండకపోవచ్చు.


