10,000 రన్స్‌.. 380 వికెట్లు! రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టార్‌ క్రికెటర్‌ | England spinner retires from red-ball cricket | Sakshi
Sakshi News home page

10,000 రన్స్‌.. 380 వికెట్లు! రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టార్‌ క్రికెటర్‌

May 14 2026 5:40 PM | Updated on May 14 2026 6:05 PM

England spinner retires from red-ball cricket

ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ లియామ్ డాస‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్ నుంచి తక్షణమే తప్పుకుంటున్నట్లు డాసన్ ప్రకటించాడు. 36 ఏళ్ల డాసన్.. తన వైట్ బాల్ కెరీర్‌ను మరింత కాలం పొడిగించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. డాసన్ త‌న 19 ఏళ్ల ఫ‌స్ట్ క్లాస్ కెరీర్‌లో 200 మ్యాచ్‌లు హాంప్‌షైర్ క్రికెట్ క్ల‌బ్ త‌ర‌పున ఆడాడు.

2026 కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా హాంప్‌షైర్ ఆడిన మొదటి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో డాసన్ పాల్గోన్నాడు. కానీ టోర్న‌మెంట్ మ‌ధ్య‌లోనే అత‌డు తప్పుకోని అంద‌రికి షాకిచ్చాడు. అయితే న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు ఇంగ్లండ్ జ‌ట్టు ప్ర‌క‌టించిన కొద్ది గంటల్లోనే డాస‌న్ ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.

వైట్ బాల్ క్రికెట్‌పై దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు డాసన్ చెబుతున్నప్పటికి, టెస్టు జట్టులో చోటు దక్కకపోవడంతోనే రెడ్ బాల్ క్రికెట్‌కు అతడు వీడ్కోలు పలికాడని ఇంగ్లండ్ క్రికెట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

"నేను ఫస్ట్-క్లాస్ క్రికెట్ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. ఇది నేను తేలికగా తీసుకున్న నిర్ణయం కాదు.
వైట్-బాల్ క్రికెట్‌లో నా కెరీర్‌ను మరింత కాలం కొనసాగించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. హాంప్‌షైర్ తరపున 200కు పైగా మ్యాచ్‌లు ఆడటం నాకు ఎంతో గర్వకారణం. 

ఈ క్రికెట్ క్లబ్‌తో నాకు ఎన్నో అద్భుతమైన  జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ 19 ఏళ్ల ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు అని డాసన్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. తన ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ కెరీర్‌లో 218 మ్యాచ్‌లు ఆడిన డాసన్‌.. 10828 పరుగులతో పాటు 380 వికెట్లు పడగొట్టాడు. అతడి పేరిట 18 ఫస్ట్‌ క్లాస్‌ సెంచరీలు ఉన్నాయి. ఇంగ్లండ్ తరపున 4 టెస్టులు ఆడిన డాసన్.. కేవలం 8 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement