breaking news
Anakapalli Movie
-
‘అనకాపల్లి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా సోనూ సూద్ (ఫొటోలు)
-
ఫుల్లుగా బిర్యానీ తిని షూటింగ్‌కి వెళ్లేవాడిని : త్రినాథరావు నక్కిన
‘‘ఇప్పటి జెన్ జీకి ఫ్యామిలీ ఎమోషన్స్ పెద్దగా తెలియడం లేదు. ఈ ఎమోషన్స్‌ని మళ్లీ అందరికీ గుర్తు చేయాలనే సందేశంతోనే ‘అనకాపల్లి’ సినిమా తీశాం’’ అన్నారు దర్శక–నిర్మాత నక్కిన త్రినాథరావు. విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ఠ, తారక్ పొన్నప్ప ప్రధాన తారాగాణంగా ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో త్రినాథరావు నక్కిన, కాండ్రేగుల నాయుడు నిర్మించిన సినిమా ‘అనకాపల్లి’. కాండ్రేగుల కుమార్ రాజా సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ– ‘‘బలమైన కుటుంబ భావోద్వేగాలతో ఓ టౌన్లో జరిగే లవ్‌స్టోరీ సినిమా ఇది. షూటింగ్ మొత్తాన్ని అనకాపల్లిలోనే పూర్తి చేశాం. అనకాపల్లి అనగానే అనకాపల్లి బెల్లం, నూకాంబిక అమ్మవారి ఆలయం కచ్చితంగా గుర్తుకువస్తాయి. ఈ రెండు అంశాలు సినిమా అంతా కనిపిస్తాయి. ఇక ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అందించి, నిర్మిస్తూనే, ఓ క్యారెక్టర్ కూడా చేశాను. నేను చేసిన ఈ మిడిల్ క్లాస్ ఫాదర్ పాత్రకు కాస్త పొట్ట ఉండాలని దర్శకుడు కోరారు. అందుకే ప్రతీ రోజూ సెట్‌కి వెళ్లేప్పుడు బిర్యానీ ఫుల్లుగా తినేసేవాడ్ని (నవ్వుతూ). కాండ్రేగుల నాయుడు మాట్లాడుతూ– ‘‘నా దృష్టిలో సినిమా అనేది చాలా గొప్పది. ఒక బడ్జెట్ పెడుతున్నామంటే ఎంతోమందికి ఉ΄ాధి కలుగుతుంది. కష్టపడేది వాళ్లు అయినా పేరు మాకు వస్తుంది. ఇలా కష్టపడే వాళ్ల కోసమే బ్యానర్లు స్థాపించి, సినిమాలు నిర్మిస్తున్నాం. ఈ సినిమా చాలా గ్రాండ్‌గా వచ్చింది. మంచి కథతో ΄ాటు కుటుంబ విలువలను తెలియజేసే మంచి సందేశం ఉంది’’ అని అన్నారు. -
సోనూ సూద్ రిలీజ్ చేసిన 'డర్టీ గ్యాంగ్స్టర్స్' సాంగ్
విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'అనకాపల్లి'. కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మించారు. ఖగేష్ తమ్మినేని దర్శకుడు. కథ, స్క్రీన్ ప్లే అందించడతో పాటు త్రినాథరావు నక్కిన ఓ ముఖ్య పాత్ర చేశారు. ఈ శుక్రవారం మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే 'డర్టీ గ్యాంగ్స్టర్స్' అంటూ సాగే పాటని సోనూసూద్ చేతుల మీదుగా విడుదల చేశారు.'డర్టీ గ్యాంగ్ స్టర్స్' పాటని కేకే రచించగా పృథ్వీ చంద్ర, కేకే ఆలపించారు. దేవ్‌జండ్ బాణీ అందించారు. ఈ పాట మాస్ ఆడియెన్స్‌కి ఇన్‌స్టంట్‌గా ఎక్కేసేలా ఉంది. ఈ లిరికల్ వీడియోలోని విజువల్స్, లొకేషన్స్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా బాగున్నాయి. -
మధ్యతరగతి నేపథ్యంలో...
విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అనకాపల్లి’. ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో భవ్యశ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్పై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మించారు. కాండ్రేగుల కుమార్ రాజా కో ప్రోడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ మూవీకి త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా ఓ ముఖ్య పాత్ర పోషించారు.ఆగస్టు 7న విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్‌ను విశాఖపట్నంలో జరిగిన ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్ 2లో టాలీవుడ్ థండర్స్ టీమ్ విడుదల చేసింది. హీరోలు శ్రీకాంత్, సుధీర్ బాబు, తరుణ్, అశ్విన్ బాబు, సంగీత దర్శకుడు తమన్ ట్రైలర్‌ను విడుదల చేసి, ‘అనకాపల్లి’ విజయం సాధించాలని ఆకాంక్షించారు. ‘‘మధ్యతరగతి నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో త్రినాథరావు, ఇంద్రజ మిడిల్ క్లాస్ పేరెంట్స్‌గా కనిపిస్తారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
‘ఎలగే పిల్ల’ పాట క్యాచీగా ఉంది : నాగవంశీ
విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటించిన తాజా చిత్రం ‘అనకాపల్లి’.భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా త్రినాథరావు నక్కి ఓ ముఖ్య పాత్రను కూడా పోషించారు. ఆగస్ట్ 7న చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. తాజాగా ఈ చిత్రంలోని ‘ఎలగే పిల్ల’ అనే పాటను ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ విడుదల చేసి చిత్రయూనిట్‌కు అభినందనలు తెలియజేశారు. పాట క్యాచీగా ఉందని, లిరికల్ వీడియోలో విజువల్స్, హీరో వేసిన స్టెప్పులు బాగున్నాయని చిత్రయూనిట్‌ను ప్రశంసించారు. ఈ మూవీ మంచి విజయాన్ని సాధించాలని ఆయన కోరుకున్నారు. ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించారు. కపిల్ కపిలాన్, దేవజండ్ గాత్రం ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. కొరియోగ్రాఫీ కూడా చాలా అందంగా ఉంది. సింపుల్ స్టెప్పుల్ని హీరో విక్రమ్ సహిదేవ్ చాలా గ్రేస్‌తో వేసినట్టుగా లిరికల్ వీడియోని చూస్తే అర్థం అవుతోంది.


