విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప నటించిన సినిమా ‘అనకాపల్లి’. దర్శక–నిర్మాత త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్‌ప్లే అందించి, నిర్మించి, నటించిన ఈ సినిమాకు ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించారు. కాండ్రేగుల నాయుడు మరో నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు కాండ్రేగుల కుమార్ రాజా సహ–నిర్మాతగా వ్యవహరించారు. అక్టోబరు 2న ఈ సినిమా విడుదలైంది.
(చదవండి: 'ప్యారడైజ్' ఎఫెక్ట్.. చిరుతో సినిమాపై నాని కామెంట్స్)
ఈ సందర్భంగా మంగళవారం జరిగిన సక్సెస్ మీట్‌లో విక్రమ్ సహిదేవ్ మాట్లాడుతూ– ‘‘మా సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. థియేటర్స్ పెరుగుతున్నాయి’’ అని చెప్పారు. ‘‘మా సినిమాకు మంచి ఫ్లోటింగ్ ఉంది. చాలా చోట్ల హౌస్‌ఫుల్స్ పడుతున్నాయి’’ అని తెలిపారు నక్కిన త్రినాథరావు. ‘‘ఎవడి గోల వాడిదే’ సినిమాని ఫస్ట్ వీక్‌కే తీసేస్తామని అన్నారు. కానీ అదే థియేటర్‌లో ఆ సినిమా చివరకు సిల్వర్ జూబ్లీ జరిగింది. అలానే ‘అనకాపల్లి’ కూడా గొప్ప విజయాన్ని సాధిస్తుంది. ఈ సినిమా దసరా ధమాకాగా నిలుస్తుంది’’ అన్నారు లగడపాటి శ్రీధర్. ‘‘మా చిత్రానికి మంచి స్పందన లభిస్తున్నప్పటికీ ఇతర భాషల సినిమాలకు థియేటర్స్ కేటాయిస్తున్నారు. మా సినిమాకు ఇంకా థియేటర్స్ కేటాయించాలని డిస్ట్రిబ్యూటర్లను కోరుతున్నాను’’ అన్నారు కాండ్రేగుల నాయుడు.


