breaking news
Vikram Sahidev
-
ఓటీటీలోకి తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వీకెండ్ అలా లెక్కలేనన్ని వచ్చాయి. వాటిలో కామ్రేడ్ కళ్యాణ్, బత్తా, సిగ్మా, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, అదే నీవు అదే నేను, మీర్జాపుర్, ఎస్సై యుగంధర్, ఇమ్మోర్టల్ చిత్రాలతో పాటు అక్క, రుద్రవనం పీఎస్ సిరీస్‌లు ఉన్నాయి. ఇవలా ఉంచితే ఓ తెలుగు యాక్షన్ థ్రిల్లర్ విడుదలకు సిద్ధమైంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ సినిమా)ప్రముఖ దర్శకుడు త్రినాథ్ నక్కిన.. నిర్మాతగా మారి నటుడిగా చేసిన సినిమా 'అనకాపల్లి'. విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట హీరోహీరోయిన్లుగా నటించారు. గత నెల 02న థియేటర్లలోకి వచ్చింది. కానీ కంటెంట్ తీసికట్టుగా ఉండటం, స్టార్స్ లేకపోవడంతో జనాలు దీనిని పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం ఈ మంగళవారం(నవంబర్ 03) నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు.'అనకాపల్లి' విషయానికొస్తే.. అనకాపల్లి ప్రాంతంలో బుల్లెట్ (తారక్ పొన్నప్ప) అనే రౌడీ పేరంటేనే భయపడే పరిస్థితి. డ్రగ్స్ బిజినెస్ చేసే నాయుడు(కాండ్రేగుల నాయుడు)తో బుల్లెట్‌కు తరచూ గొడవలు జరుగుతుంటాయి. ఇదే ఊరిలో నిజాయితీగా బతుకుతూ ఏఈగా పనిచేసే సాంబశివరావు (త్రినాథరావు నక్కిన) కొడుకు సూర్య (విక్రమ్ సహిదేవ్).. బుల్లెట్‌ని చూసి ఆకర్షితుడై అతడి గ్యాంగ్‌లో చేరతాడు.ఇద్దరూ కలిసి ఎమ్మెల్యే (వడ్లమాని శ్రీనివాస్) అనుచరుడు నాయుడిని మర్డర్ చేస్తారు. బుల్లెట్టుకు నమ్మకమైన అనుచరుడిగా ఉన్న సూరి ఎదురు తిరుగుతాడు. బుల్లెట్టు ఆధిపత్యాన్ని సవాల్ చేస్తాడు. సూరి అలా ఎందుకు చేశాడు? తొలి చూపులోనే ఇష్టపడ్డ అమృత (సంధ్య వశిష్ట)తో సూరి ప్రేమాయణం ఎలా సాగింది? బుల్లెట్, సూర్య, అమృత, నాయుడు మధ్య సంబంధాలు చివరకు ఎలాంటి పరిణామాలకు దారితీశాయి? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'అనకాపల్లి' మూవీ రివ్యూ)When unexpected twists meet unforgettable moments, you know you're in for a ride! 🔥 Watch Anakapalli on SunNXT from Nov 3. #Anakapalli #TeluguCinema #MovieTime #Entertainment #SunNXT https://t.co/45ypZ6mRCL— SUN NXT (@sunnxt) October 31, 2026 -
‘మా సినిమాకు మంచి ఫ్లోటింగ్ ఉంది.. హౌస్‌ఫుల్ అవుతోంది : నక్కిన త్రినాథరావు
విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప నటించిన సినిమా ‘అనకాపల్లి’. దర్శక–నిర్మాత త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్‌ప్లే అందించి, నిర్మించి, నటించిన ఈ సినిమాకు ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించారు. కాండ్రేగుల నాయుడు మరో నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు కాండ్రేగుల కుమార్ రాజా సహ–నిర్మాతగా వ్యవహరించారు. అక్టోబరు 2న ఈ సినిమా విడుదలైంది. (చదవండి: 'ప్యారడైజ్' ఎఫెక్ట్.. చిరుతో సినిమాపై నాని కామెంట్స్)ఈ సందర్భంగా మంగళవారం జరిగిన సక్సెస్ మీట్లో విక్రమ్ సహిదేవ్ మాట్లాడుతూ– ‘‘మా సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. థియేటర్స్ పెరుగుతున్నాయి’’ అని చెప్పారు. ‘‘మా సినిమాకు మంచి ఫ్లోటింగ్ ఉంది. చాలా చోట్ల హౌస్‌ఫుల్స్ పడుతున్నాయి’’ అని తెలిపారు నక్కిన త్రినాథరావు. ‘‘ఎవడి గోల వాడిదే’ సినిమాని ఫస్ట్ వీక్‌కే తీసేస్తామని అన్నారు. కానీ అదే థియేటర్లో ఆ సినిమా చివరకు సిల్వర్ జూబ్లీ జరిగింది. అలానే ‘అనకాపల్లి’ కూడా గొప్ప విజయాన్ని సాధిస్తుంది. ఈ సినిమా దసరా ధమాకాగా నిలుస్తుంది’’ అన్నారు లగడపాటి శ్రీధర్. ‘‘మా చిత్రానికి మంచి స్పందన లభిస్తున్నప్పటికీ ఇతర భాషల సినిమాలకు థియేటర్స్ కేటాయిస్తున్నారు. మా సినిమాకు ఇంకా థియేటర్స్ కేటాయించాలని డిస్ట్రిబ్యూటర్లను కోరుతున్నాను’’ అన్నారు కాండ్రేగుల నాయుడు. -
'అనకాపల్లి' మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్ : అనకాపల్లి నటీనటులు: విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప, త్రినాథ రావు నక్కిన, ఇంద్రజ, సంగీత క్రిష్, కండ్రేగుల నాయుడు, నందిని రాయ్, మహబూబ్ భాషా, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు నిర్మాణ సంస్థలు: నక్కిన నరేటివ్స్, భవ్యశ్రీ మూవీ మేకర్స్ నిర్మాత: త్రినాథ రావు నక్కిన కథ, స్క్రీన్ ప్లే: త్రినాథ రావు నక్కిన దర్శకత్వం: ఖగేష్ తమ్మినేని సంగీతం: డేవ్జాండ్సినిమాటోగ్రాఫర్: కటివరపు వంశీ కృష్ణ ఎడిటర్: అత్తలూరి శ్రీకృష్ణ విడుదల తేదీ : అక్టోబర్ 2, 2026కథ ఏంటంటే..అనకాపల్లి ప్రాంతంలో బుల్లెట్ (తారక్ పొన్నప్ప) పేరంటేనే భయపడే పరిస్థితి. రౌడీగా తనదైన హవాను కొనసాగిస్తూ ఉంటాడు. అదే సమయంలో డ్రగ్స్ వ్యాపారం చేసే నాయుడు (కాండ్రేగుల నాయుడు)తో బుల్లెట్‌కు తరచూ గొడవలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో బుల్లెట్ చుట్టూ తిరిగే ప్రపంచం మరింత ప్రమాదకరంగా మారుతుంటుంది.మరోవైపు అదే ప్రాంతంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏఈగా పనిచేస్తుంటాడు సాంబశివరావు (త్రినాథరావు నక్కిన). నిజాయితీకి ప్రాధాన్యమిస్తూ, సాధారణ మధ్యతరగతి జీవితాన్ని గడిపే వ్యక్తి అతడు. అయితే అతని కొడుకు సూర్య (విక్రమ్ సహిదేవ్) మాత్రం తండ్రి జీవన విధానంతో సంతృప్తిగా ఉండడు. మిడిల్ క్లాస్ జీవితంపై అసంతృప్తితో ఉండే సూర్య.. బుల్లెట్ హవా, అతడి యాటిట్యూడ్, చుట్టూ ఉండే హీరోయిజం చూసి ఆకర్షితుడవుతాడు. అలా బుల్లెట్ గ్యాంగ్‌లో చేరిన సూర్య.. క్రమంగా అతడికి అత్యంత నమ్మకమైన వ్యక్తిగా, రైట్ హ్యాండ్‌గా మారతాడు. ఇద్దరు కలిసి ఎమ్మెల్యే ( వడ్లమాని శ్రీనివాస్) అనుచరుడు నాయుడిని మర్డర్ చేస్తారు. ఇలా బుల్లెట్టుకు అత్యంత నమ్మకమైన అనుచరుడిగా ఉన్న సూరి ఎదురు తిరుగుతాడు. బుల్లెట్టు ఆధిపత్యాన్ని సవాల్ చేస్తాడు. సూరి అలా ఎందుకు చేశాడు? తొలి చూపులోనే ఇష్టపడ్డ అమృత ( సంధ్య వశిష్ట) తో సూరి ప్రేమాయణం ఎలా సాగింది? బుల్లెట్, సూర్య, అమృత, నాయుడు మధ్య సంబంధాలు చివరకు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి? ఈ కథలో సూర్య తల్లి జయంతి (ఇంద్రజ) పాత్ర ఎలాంటి మలుపు తీసుకొస్తుంది? చివరికి వీరి ప్రయాణం ఎలా ముగిసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే...రెగ్యులర్ రూరల్ మాఫియా యాక్షన్ థ్రిల్లర్. అయితే బుల్లెట్ పాత్ర చుట్టూ దర్శకుడు డిజైన్ చేసిన ఎన్విరాన్మెంట్, అందులోని క్యారెక్టర్స్ మాత్రం కొత్తగా అనిపిస్తాయి. ముఖ్యంగా సూరి పాత్రను మలిచిన విధానం ఆకట్టుకుంటుంది. లోకల్ గుండాయిజం, లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను ఒకే కథలో మేళవించి ఆసక్తికరంగా చెప్పేందుకు చేసిన ప్రయత్నం బాగుంది. రెగ్యులర్ ఫార్మాట్లోనే సాగుతున్న కథలో కొత్త ట్విస్టులు, ఎమోషనల్ ఎలిమెంట్స్‌ను జోడించిన విధానం ఈ సినిమాకు ప్లస్‌గా నిలుస్తుంది.కథలో చెప్పడానికి కూడా ఎన్నో అంశాలను దర్శకుడు ప్రయత్నించారు. ఓ కుర్రాడు తప్పుదారి పడితే అతని జీవితం ఎలా మారిపోతుంది? కత్తి పట్టిన వాడు చివరికి కత్తిపోటుకే ఎలా బలవుతాడు? పిల్లలు చేసే తప్పులకు తల్లిదండ్రులు పడే వేదన ఎలా ఉంటుంది? ప్రేమకు, ఆకర్షణకు మధ్య ఉన్న తేడా ఏంటి? వంటి అంశాలను ప్రధాన కథలో అంతర్లీనంగా చెప్పే ప్రయత్నం కనిపిస్తుంది. త్రినాథరావు రాసిన కథకు ఖగేష్ తనదైన శైలిలో న్యాయం చేశాడని అనిపిస్తుంది.ఫస్ట్ హాఫ్‌లో బుల్లెట్ హంగామా, అతని గ్యాంగ్‌లో సూరి చేరడం, మెల్లిమెల్లిగా ఎదగడం, మరోవైపు హీరోయిన్ ఎంట్రీ, లవ్ ట్రాక్ ఇలా కథ సాదాసీదాగానే సాగుతుంది. కొన్ని చోట్ల సుదీర్ఘమైన సన్నివేశాలతో కథను సాగదీసిన భావన కలుగుతుంది. ‘ఇందులో కొత్తగా ఏముంది?’ అనిపించే సమయంలో వచ్చే ఇంటర్వెల్ ట్విస్ట్ కథపై ఆసక్తిని పెంచుతుంది. ఆ ట్విస్ట్‌ను కొంతమంది ముందే ఊహించే అవకాశం ఉన్నప్పటికీ.. ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం ఎమోషనల్‌గా టచ్ చేస్తుంది. ఇక కొన్ని ఎపిసోడ్స్‌ను గ్రిప్పింగ్‌గా తెరకెక్కించడంలో దర్శకుడు తన ప్రతిభను చూపించాడు.సెకండాఫ్‌లో కథ ప్రధానంగా ఎమోషన్, రివెంజ్ చుట్టూ తిరుగుతుంది. ఈ భాగంలో రొటీన్ రివెంజ్ డ్రామా కొనసాగినప్పటికీ.. పాత్రల భావోద్వేగాలను ముందుకు తీసుకెళ్లిన తీరు కొంత ఆసక్తిని కలిగిస్తుంది. క్లైమాక్స్ వచ్చేసిందనుకున్న సమయంలో మరో కీలకమైన బ్లాక్‌ను పెట్టడం, దానికి డివోషనల్ ఎలిమెంట్స్‌ను జోడించి కథను ముగించిన విధానం ఆకట్టుకుంటుంది. చివరికి ప్రేమకు ఒక నిర్వచనం చెప్పేలా సినిమాను ముగించడంతో కథకు ఎమోషనల్ టచ్ వస్తుంది.ఎవరెలా చేశారంటే..విక్రమ్ సహిదేవ్ హీరో సూర్య పాత్రలో అన్ని రకాల భావోద్వేగాలను చక్కగా పండించాడు. ఎమోషన్స్, యాక్షన్, రొమాన్స్, కామెడీ.. ఇలా విభిన్న కోణాల్లోనూ తనదైన నటనతో మెప్పించాడు. అయితే కొన్ని సన్నివేశాల్లో ఇంకాస్త పరిణతి చూపించి ఉంటే పాత్ర మరింత బలంగా అనిపించేది. ఇక తారక్ పొన్నప్ప తన నటనతో భయపెట్టేస్తాడు. అతడి బాడీ లాంగ్వేజ్, హావభావాలు పాత్రకు తగ్గట్టుగా ఉన్నాయి. సంధ్య వశిష్ట కూడా అనకాపల్లి అమ్మాయిలా చాలా సహజంగా కనిపిస్తూ ఆకట్టుకుంది.ఫస్ట్ హాఫ్‌లో డ్రగ్స్ డాన్ నాయుడు పాత్రలో నిర్మాత కాండ్రేగుల నాయుడు చక్కగా నటించాడు. తండ్రి పాత్రలో త్రినాథరావు, తల్లి పాత్రలో ఇంద్రజ మిడిల్‌క్లాస్ తల్లిదండ్రులకు ప్రతినిధులుగా సహజమైన నటనను కనబరిచారు. రౌడీ గ్యాంగ్, ఎమ్మెల్యే, ఎస్సై, డీఎస్పీ తదితర పాత్రల్లో కనిపించిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు మెప్పించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా చూస్తున్నంతసేపూ మనల్ని కూడా అనకాపల్లి వాతావరణంలోకి తీసుకెళ్లిన అనుభూతి కలుగుతుంది. నేపథ్య సంగీతం , పాటలు సినిమాకి ప్లస్ అయ్యాయి. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేసి..నిడివి తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. -
‘అనకాపల్లి’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
అమ్మోరే దిగినాది...
విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటించిన సినిమా ‘అనకాపల్లి’. దర్శకుడు నక్కిన త్రినాథరావు ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించి, ఓ కీలక పాత్రలో నటించారు. ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ పతాకంపై కాండ్రేగుల నాయుడు, నక్కిన త్రినాథరావు నిర్మించిన ఈ చిత్రం జూన్ 5న విడుదల కానుంది. ఈ సినిమా నుంచి ‘అమ్మోరు దిగినాది... అమ్మోరే దిగినాది..’ అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు.‘‘కుంకాల పోగుంది... పసుపంటి నేలుంది... కాగడాల చమురు కాలుతూ నవ్వింది.... ఘల్లన్న ఈ గజ్జలు ఎవరంటూ చూశాము... చింతానిప్పుల వెనక నల్ల రాతిరిలాగా... నల్ల రాతిరిలాగా... అమ్మోరు దిగినాది... అమ్మోరే దిగినాది..’అంటూ సాగే ఈ జాతర పాటకు గణేష్ సలాది సాహిత్యం అందించగా, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. సంగీత దర్శకుడు దేవ్ జండ్ స్వరకల్పనలో మంగ్లీ పాడారు. ‘‘యూత్ ఎలిమెంట్స్, లవ్, కుటుంబ భావోద్వేగాల మేళవింపుతో ఈ సినిమా కథనం ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. -
ఎమోషనల్ లవ్ స్టోరీ.. అనకాపల్లి టీజర్ చూశారా?
విక్రమ్ సాహిదేవ్, సంధ్యా వశిష్ఠ, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం అనకాపల్లి. ఈ సినిమాకు తమ్మినేని ఖగేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి డైరెక్టర్ నక్కిన త్రినాథరావు కథ అందించారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.తాజాగా రిలీజైన అనకాపల్లి టీజర్ చూస్తుంటే ప్రేమకథా చిత్రంగా ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని భవ్యశ్రీ మూవీ మేకర్స్, నక్కిన నారేటివ్స్ బ్యానర్లపై కండ్రేగుల నాయుడు, నక్కిన త్రినాథరావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవ్జాండ్ సంగీతమందిస్తున్నారు. -
మరో 'వర్జిన్ స్టోరీ' మూవీ ట్రైలర్
-
ఆ లోటుని మా సినిమా భర్తీ చేస్తుంది
‘‘సాధారణంగా స్టార్స్ ఉన్న సినిమాలైతే ముందు వాటి గురించి మాట్లాడుకున్న తర్వాత సినిమాకి వెళతారు. కానీ, ‘ఎవడు తక్కువ కాదు’లో స్టార్స్ లేరు. కథే స్టార్. ముందు మాట్లాడుకుని తర్వాత చూసే సినిమా కాదిది. సినిమా చూశాక దాని గురించి మాట్లాడుకునేలా ఉంటుంది’’ అన్నారు లగడపాటి శ్రీధర్. ‘రేసుగుర్రం, పటాస్, రుద్రమదేవి, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ సహిదేవ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఎవడు తక్కువ కాదు’. తమిళ ‘గోలీ సోడా’ సినిమాకి ఇది రీమేక్. రఘు జయ దర్శకత్వంలో లగడపాటి శిరీషా సమర్పణలో లగడపాటి శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజవుతోంది. లగడపాటి శ్రీధర్ చెప్పిన విశేషాలు. ► టీనేజ్ లవ్‌స్టోరీ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘ఎవడు తక్కువ కాదు’. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో తమిళంలో రూ. 2 కోట్లతో తీసిన ‘గోలీ సోడా’ సినిమా రూ. 20కోట్లు వసూలు చేసింది. తెలుగులో ఇంకా ఎక్కువ బడ్జెట్‌తో, మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో రిచ్‌గా తీశాం. ► ‘గోలీ సోడా’ చిత్రానికి హీరోయిన్ సమంత పెద్ద అభిమాని. కథ అంత బాగుంటుంది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ కథలో మార్పులు చేశాం. టీనేజర్స్ నేపథ్యంలో తెలుగులో ఈ మధ్య మంచి సినిమా రాలేదు. ఆ లోటుని మా సినిమా భర్తీ చేస్తుంది. ► యూత్‌లో ఎవడూ తక్కువ కాదు. వారికి ఎన్నో కలలు ఉంటాయి. వాటిని ఎలా సాధించొచ్చు? సాధించిన దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి? అని మా సినిమాలో చెప్పాం. క్లైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ► వేసవికి కావాల్సిన మాస్ యూత్‌ఫుల్ ఫిల్మ్. ఓవర్సీస్లో రిలీజ్‌కి ప్లాన్ చేయలేదు. ఇక్కడ స్పందనను బట్టి రిలీజ్ చేద్దామనుకుంటున్నాం. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాకి విక్రమ్‌కి ఎంత పేరొచ్చిందో ఈ సినిమాతో అంతకుమించి వస్తుంది. డిస్ట్రిబ్యూటర్లకు సినిమా చూపించా.. చాలా సంతోషంగా అన్ని ఏరియాల వాళ్లు కొనుక్కోవడం బిగ్గెస్ట్ సక్సెస్. -
దమ్మున్న కుర్రోడి కథ
‘‘పోయిన చోటే వెతుక్కోవాలి’ అని తెలుగులో ఒక నానుడి. ఓ కుర్రాడు మార్కెట్లో పడిన చోటే పైకి లేచి నిలబడాలని ప్రయత్నించాడు. వయసులో చిన్నోడు అయినా ధైర్యంగా మార్కెట్లో పెద్దలతో తలపడ్డాడు. అప్పుడు ఆ పెద్దలు ఏం చేశారు? ఈ యుద్ధంలో చివరికి ఏమైంది? అనేది ఈ నెల 24న తెరపై చూసి తెలుసుకోవాలి’’ అని దర్శకుడు రఘు జయ అంటున్నారు. విక్రమ్ సహిదేవ్, ప్రియాంకా జైన్ జంటగా రఘు జయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎవడు తక్కువ కాదు’. ‘ఎ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్’ అన్నది ఉపశీర్షిక. లగడపాటి శిరీష సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మించారు. ఈ నెల 24న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘పగ, ప్రతీకారం నేపథ్యంలో సరికొత్త కథ, కథనంతో రూపొందిన చిత్రమిది. ఓ అందమైన ప్రేమకథ కూడా ఉంటుంది. రఘు జయ చాలా సహజంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రచార చిత్రాలకు, పాటలకు ప్రశంసలు రావడం ఆనందంగా ఉంది. ట్రైలర్లో విక్రమ్ సహిదేవ్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ బావుందని అందరూ ప్రశంసించడం సంతోషంగా ఉంది. ట్రైలర్ విడుదల చేసిన సుకుమార్‌గారు కూడా మెచ్చుకున్నారు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: హరి గౌర. -
మే 24న ‘ఎవడు తక్కువ కాదు’
బాలనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ సహిదేవ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘ఎవడు తక్కువ కాదు’. ‘ఎ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్’ అనేది ట్యాగ్ లైన్. లగడపాటి శిరీష సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రానికి రఘు జయ దర్శకుడు. ప్రియాంక జైన్ కథానాయికగా నటించిన ఈ సినిమాకు హరి గౌర సంగీతమందించారు. ‘పోయిన చోటే వెతుక్కోవాలి’ ‘పడిన చోటే పైకి లేచి నిలబడాలని’ పెద్దలు చెబుతారు. ఒక మార్కెట్లో కుర్రాడు పడిన చోటే పైకి లేచి నిలబడాలని ప్రయత్నించాడు. వయసులో చిన్నోడు అయినా ధైర్యంగా మార్కెట్లో పెద్దలతో తలపడ్డాడు. అప్పుడు ఆ పెద్దలు ఏం చేశారు? ఆ కుర్రాడు, అతడికి ఉన్న వ్యక్తులు ఎలా ఎదుర్కొన్నారు? ఈ యుద్ధంలో చివరికి ఏమైంది? అనేది ‘ఎవడు తక్కువ కాదు’ కథ. ఇప్పటికే సెన్సార్‌కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 24న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ ‘ప్రచార చిత్రాలకు, పాటలకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు రావడం ఆనందంగా ఉంది. పగ, ప్రతీకారం నేపథ్యంలో సరికొత్త కథ, కథనంతో రూపొందిన చిత్రమిది. అలాగే, ఓ అందమైన ప్రేమకథ కూడా ఉంటుంది. దర్శకుడు రఘు జయ చాలా సహజంగా చిత్రాన్ని తెరకెక్కించాడు. రియలిస్టిక్, రా అప్రోచ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ట్రైలర్లో విక్రమ్ సహిదేవ్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ బావుందని, అగ్రెస్సివ్‌గా చేశాడని అంతాప్రశంసిస్తున్నారు. ట్రైలర్ విడుదల చేసిన సుకుమార్ గారు కూడా మెచ్చుకున్నారు. సినిమా చూసి ప్రేక్షకులు మా విక్రమ్ ను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే చిత్రమిది’ అని అన్నారు. -
అందుకు ధైర్యం కావాలి
‘రేసుగుర్రం, పటాస్, రుద్రమదేవి, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ వంటి సినిమాల్లో నటించిన విక్రమ్ సహిదేవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఎవడు తక్కువ కాదు’. ‘ఎ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్’ అన్నది ఉపశీర్షిక. ప్రియాంక జైన్ కథానాయికగా, రఘు కారుమంచి కీలకపాత్రలో నటించారు. రఘు జయ దర్శకత్వంలో లగడపాటి శిరీష సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మించిన ఈ సినిమాని మే 11న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ని దర్శకుడు సుకుమార్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘తమిళ సినిమా ‘గోలి సోడా’కు రీమేక్ ఇది. ఈ చిత్రం ట్రైలర్ చాలా బావుంది. కొన్ని విజువల్స్ చూశా.. విక్రమ్ బాగా చేశాడు. తను 15ఏళ్లకే ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలో అంత పెద్ద పాత్రను తన భుజాల మీద మోయడం గొప్ప విషయం. ఇప్పుడు తనకు 17 ఏళ్లు. ఇంకా ఇంటర్ పూర్తి కాలేదు. లగడపాటి శ్రీధర్‌గారు విక్రమ్‌ని హీరోగా పెట్టి పెద్ద సినిమాతో భారీ లాంచింగ్ ప్లాన్ చేయొచ్చు. అలా కాకుండా కుమారుడు ఆర్టిస్టుగా ఎదగాలని, కళాకారుడిగా ఒక ప్రయాణం కొనసాగించాలని అనుకోవడం చాలా బాగా నచ్చింది. విక్రమ్ సహిదేవ్‌కు ఈ సినిమా పెద్ద విజయం అందించాలని కోరుకుంటున్నా. ఈ సినిమాతో శ్రీకాంత్ ఎడిటర్‌గా పరిచయం అవుతున్నారు. కొత్త ఆర్టిస్టులను పరిచయం చేయవచ్చు గానీ.. కొత్త సాంకేతిక నిపుణులను పరిచయం చేయడానికి ధైర్యం కావాలి. శ్రీధర్‌గారికి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘టీనేజ్ ప్రేమకథతో తెరకెక్కిన న్యూ ఏజ్ రివెంజ్ డ్రామా ఇది. మా విక్రమ్ సహిదేవ్‌కు మంచి పేరు తెస్తుందని నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు లగడపాటి శ్రీధర్. -
తాడో పేడో తేల్చేసెయ్
విక్రమ్ సహిదేవ్ ప్రధాన పాత్రలో రఘు జయ దర్శకత్వంలో లగడపాటి శ్రీధర్ నిర్మించిన చిత్రం ‘ఎవడు తక్కువ కాదు’. ‘ఏ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్’ అనేది ఉపశీర్షిక. ‘రేసుగుర్రం, పటాస్, రుద్రమదేవి, నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’ సినిమాల్లో బాలనటుడిగా ప్రశంసలు అందుకున్నాడు విక్రమ్. ఇక, తను ప్రధాన పాత్ర చేస్తున్న ‘ఎవడు తక్కువ కాదు’ చిత్రంలోని తొలి పాట ‘లైఫ్ ఈజ్ ఏ క్యాసినో... తాడో పేడో తేల్చేసెయ్... నీ ఆటేదో ఆడేసెయ్’ అనే పాటను సోమవారం విడుదల చేశారు. ‘‘రిలీజ్ చేసిన పాటకు, టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. యాక్షన్‌తో పాటు అందమైన టీనేజ్ ప్రేమకథతో రూపొందిన చిత్రం ఇది. మా సంస్థలో మంచి చిత్రం అవుతుంది. విక్రమ్‌కు నటుడిగా మంచి పేరు వస్తుంది. త్వరలో మిగతా పాటలను, ఈ నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత లగడపాటి శ్రీధర్. -
ప్రేమ..ప్రతీకారం
లగడపాటి విక్రమ్ సహిదేవ్ హీరోగా రూపొందిన చిత్రం ‘ఎవడు తక్కువ కాదు’. ‘ఎ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్’ అనేది ఉపశీర్షిక. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘నా పేరు సూర్య –నా ఇల్లు ఇండియా’ సినిమాలో అన్వర్ పాత్రలో సహిదేవ్ నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘ఎవడు తక్కువ కాదు’ చిత్రానికి రఘు జయ దర్శకత్వం వహించారు. లగడపాటి శిరీష సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మించారు. టైటిల్‌ను అనౌన్స్ చేసి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ‘‘ఎ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్’ అనే ట్యాగ్‌లైన్ హీరో క్యారెక్టర్‌కు బాగా సూట్ అవుతుంది. కథకు తగ్గట్లు వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తారు. సహిదేవ్‌కు మంచి పేరు వస్తుంది. సినిమాలో యాక్షన్‌తోపాటు అందమైన టీనేజ్ లవ్‌స్టోరీ ఉంటుంది. న్యూ ఏజ్ రివేంజ్ డ్రామా కూడా. ఫస్ట్‌లుక్, టైటిల్‌కు రెస్పాన్స్ వస్తోంది. మా సంస్థలో ఓ మంచి సినిమాగా నిలిచిపోతుంది’’ అని అన్నారు నిర్మాత లగడపాటి శ్రీధర్. -
విక్రమ్ సహిదేవ్ హీరోగా ‘ఎవడు తక్కువకాదు’
‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలో అల్లు అర్జున్ పవర్‌ప్యాక్డ్ ఫర్ఫార్మెన్స్తో మెస్మరైజ్ చేశారు. బన్నీతో పాటు అదే సినిమాలో నటుడిగా మెరిసిన మరో యువకుడు విక్రమ్ సహిదేవ్. అన్వర్ పాత్రలో విక్రమ్ సహిదేవ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంతకు ముందు ‘రేసుగుర్రం’లో అల్లు అర్జున్ చిన్నప్పటి పాత్రలో మెప్పించాడు. ఇప్పుడీ కుర్రాడు ఓ సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. లగడపాటి శిరీష సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న సినిమా ‘ఎవడు తక్కువ కాదు’. విక్రమ్ సహిదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ‘ఎ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్’ అన్నది ఉపశీర్షిక. రఘు జయ దర్శకుడు. హోలీ సందర్భంగా సినిమా టైటిల్ ప్రకటించడంతో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ ‘ఎ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్... అనేది ప్రధాన పాత్రలో నటిస్తున్న విక్రమ్ సహిదేవ్ క్యారెక్టర్ కు ఫర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. న్యూ ఏజ్ రివెంజ్ డ్రామా ఇది. బాల నటుడిగా ఆకట్టుకున్న మా విక్రమ్ సహిదేవ్, కథకు తగ్గట్టు వైవిద్యమైన పాత్రలో కనిపిస్తాడు. యాక్షన్‌తో పాటు అందమైన టీనేజ్ ప్రేమకథతో రూపొందుతోన్న చిత్రమిది. చిత్రీకరణ పూర్తయింది. హోలీ సందర్బంగా సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేసాం. మా సంస్థలో ఇది ఓ మంచి సినిమాగా నిలవటంతో పాటు, విక్రమ్ మంచి పేరు తీసుకొస్తుందని నమ్మకంగా ఉన్నాం’ అన్నారు. -
హీరోగా లగడపాటి వారసుడు
పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన లగడపాటి శ్రీధర్ తనయుడు, విక్రమ్ సహిదేవ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే రేసుగుర్రం, రుద్రమదేవి, పటాస్ లాంటి సినిమాల్లో బాలనటుడిగా అలరించిన విక్రమ్ కన్నడ సినిమాతో లీడ్ యాక్టర్‌గా మారుతున్నాడు. నలుగురు యువకుల జీవితాల్లోని సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 19న రిలీజ్ కానుంది. తమిళంలో ఘనవిజయం సాధించిన గోలీసోడా సినిమాను అదే పేరుతో కన్నడలో రీమేక్ చేశారు. ఈ సినిమాతో లగడపాటి శ్రీదర్ తనయుడు విక్రమ్ సహిదేవ్తో పాటు కన్నడ నటులు సాధు కోకిల, అరుణ్ సాగర్ల తనయులు కూడా వెండితెరకు పరిచయం అవుతున్నారు. కన్నడలో రిలీజ్ తరువాత తెలుగులోనూ ఈ సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు లగడపాటి శ్రీధర్.


