ఎమోషనల్‌ లవ్ స్టోరీ.. అనకాపల్లి టీజర్‌ చూశారా? | Vikram Sahidev And Sandhya Vasishta Anakapalli Movie Teaser Out Now, Watch Video Inside | Sakshi
Sakshi News home page

ANAKAPALLI Teaser: ఎమోషనల్‌ లవ్ స్టోరీ.. అనకాపల్లి టీజర్‌ చూశారా?

Mar 29 2026 1:00 PM | Updated on Mar 29 2026 2:07 PM

Vikram Sahidev Sandhya Vasishta ANAKAPALLI Teaser out now

విక్రమ్‌ సాహిదేవ్‌, సంధ్యా వశిష్ఠ, తారక్‌ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం అనకాపల్లి. ఈ సినిమాకు తమ్మినేని ఖగేశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి డైరెక్టర్ నక్కిన త్రినాథరావు కథ అందించారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

తాజాగా రిలీజైన అనకాపల్లి టీజర్  చూస్తుంటే ప్రేమకథా చిత్రంగా ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని భవ్యశ్రీ మూవీ మేకర్స్, నక్కిన నారేటివ్స్ బ్యానర్లపై కండ్రేగుల నాయుడు, నక్కిన త్రినాథరావు  నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవ్‌జాండ్‌ సంగీతమందిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement