అమ్మోరే దిగినాది... | Ammoru Diginadhi lyrical video Song Release from Anakapalli Movie | Sakshi
Sakshi News home page

అమ్మోరే దిగినాది...

May 1 2026 12:01 AM | Updated on May 1 2026 12:01 AM

Ammoru Diginadhi lyrical video Song Release from Anakapalli Movie

విక్రమ్‌ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటించిన సినిమా ‘అనకాపల్లి’. దర్శకుడు నక్కిన త్రినాథరావు ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ ప్లే అందించి, ఓ కీలక పాత్రలో నటించారు. ఖగేష్‌ తమ్మినేని దర్శకత్వంలో భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్‌ పతాకంపై కాండ్రేగుల నాయుడు, నక్కిన త్రినాథరావు నిర్మించిన ఈ చిత్రం జూన్‌ 5న విడుదల కానుంది. ఈ సినిమా నుంచి ‘అమ్మోరు దిగినాది... అమ్మోరే దిగినాది..’ అనే పాట లిరికల్‌ వీడియోను విడుదల చేశారు.

‘‘కుంకాల పోగుంది... పసుపంటి నేలుంది... కాగడాల చమురు కాలుతూ నవ్వింది.... ఘల్లన్న ఈ గజ్జలు ఎవరంటూ చూశాము... చింతానిప్పుల వెనక నల్ల రాతిరిలాగా... నల్ల రాతిరిలాగా... అమ్మోరు దిగినాది... అమ్మోరే దిగినాది..’అంటూ సాగే ఈ జాతర పాటకు గణేష్‌ సలాది సాహిత్యం అందించగా, శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేశారు. సంగీత దర్శకుడు దేవ్‌ జండ్‌ స్వరకల్పనలో మంగ్లీ పాడారు. ‘‘యూత్‌ ఎలిమెంట్స్, లవ్, కుటుంబ భావోద్వేగాల మేళవింపుతో ఈ సినిమా కథనం ఉంటుంది’’ అని యూనిట్‌ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement