breaking news
Tarak Ponnappa
-
ఫుల్లుగా బిర్యానీ తిని షూటింగ్‌కి వెళ్లేవాడిని : త్రినాథరావు నక్కిన
‘‘ఇప్పటి జెన్ జీకి ఫ్యామిలీ ఎమోషన్స్ పెద్దగా తెలియడం లేదు. ఈ ఎమోషన్స్‌ని మళ్లీ అందరికీ గుర్తు చేయాలనే సందేశంతోనే ‘అనకాపల్లి’ సినిమా తీశాం’’ అన్నారు దర్శక–నిర్మాత నక్కిన త్రినాథరావు. విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ఠ, తారక్ పొన్నప్ప ప్రధాన తారాగాణంగా ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో త్రినాథరావు నక్కిన, కాండ్రేగుల నాయుడు నిర్మించిన సినిమా ‘అనకాపల్లి’. కాండ్రేగుల కుమార్ రాజా సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ– ‘‘బలమైన కుటుంబ భావోద్వేగాలతో ఓ టౌన్లో జరిగే లవ్‌స్టోరీ సినిమా ఇది. షూటింగ్ మొత్తాన్ని అనకాపల్లిలోనే పూర్తి చేశాం. అనకాపల్లి అనగానే అనకాపల్లి బెల్లం, నూకాంబిక అమ్మవారి ఆలయం కచ్చితంగా గుర్తుకువస్తాయి. ఈ రెండు అంశాలు సినిమా అంతా కనిపిస్తాయి. ఇక ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అందించి, నిర్మిస్తూనే, ఓ క్యారెక్టర్ కూడా చేశాను. నేను చేసిన ఈ మిడిల్ క్లాస్ ఫాదర్ పాత్రకు కాస్త పొట్ట ఉండాలని దర్శకుడు కోరారు. అందుకే ప్రతీ రోజూ సెట్‌కి వెళ్లేప్పుడు బిర్యానీ ఫుల్లుగా తినేసేవాడ్ని (నవ్వుతూ). కాండ్రేగుల నాయుడు మాట్లాడుతూ– ‘‘నా దృష్టిలో సినిమా అనేది చాలా గొప్పది. ఒక బడ్జెట్ పెడుతున్నామంటే ఎంతోమందికి ఉ΄ాధి కలుగుతుంది. కష్టపడేది వాళ్లు అయినా పేరు మాకు వస్తుంది. ఇలా కష్టపడే వాళ్ల కోసమే బ్యానర్లు స్థాపించి, సినిమాలు నిర్మిస్తున్నాం. ఈ సినిమా చాలా గ్రాండ్‌గా వచ్చింది. మంచి కథతో ΄ాటు కుటుంబ విలువలను తెలియజేసే మంచి సందేశం ఉంది’’ అని అన్నారు. -
ఇతడు విలన్‌గా చేస్తే పాన్ ఇండియా హిట్ కన్ఫర్మ్!? (ఫొటోలు)
-
పుష్ప 2లో అరగుండు నటుడు.. అతని రెమ్యునరేషన్ అన్ని కోట్లా? (ఫోటోలు)
-
పుష్ప 2 ట్రైలర్.. ఈ అర గుండు నటుడు ఎవరంటే?
అనుకున్నట్లుగానే 'పుష్ప 2' ట్రైలర్ వైల్డ్ ఫైర్‌లా ఉంది. పెద్దగా కథ రివీల్ చేయలేదు గానీ మూవీ ఎంత గ్రాండియర్‌గా ఉండబోతుందనేది శాంపిల్ చూపించారు. తొలి భాగంలో ఉన్న చాలామంది యాక్టర్స్.. ట్రైలర్లో కనిపించారు. వీళ్లతో పాటు పలు కొత్త పాత్రలు కూడా కనిపించాయి. మిగతా వాళ్ల సంగతేమో గానీ అరగుండుతో ఓ పాత్ర కనిపించింది. ఇంతకీ ఈ నటుడు ఎవరబ్బా అని అందరూ బుర్ర గోక్కుంటున్నారు.ట్రైలర్లో అర గుండు, మెడలో చెప్పుల దండతో కనిపించిన నటుడి పేరు తారక్ పొన్నప్ప. స్వతహాగా కన్నడ నటుడు అయిన ఇతడు 'కేజీఎఫ్' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. మొన్నటికి మొన్న 'దేవర'లోనూ విలన్ సైఫ్ అలీఖాన్ కొడుకుగా నటించాడు. ఇప్పుడు 'పుష్ప 2'లోనూ కీలక పాత్ర పోషించినట్లే కనిపిస్తున్నాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు)కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'పుష్ప 2లో చాలా ముఖ్యమైన పాత్రలో నటించాను. నా క్యారెక్టర్ మూవీ టర్న్ అయ్యే ట్విస్ట్ మాత్రమే కాదు. పుష్ప లైఫ్ మారిపోయే ట్విస్ట్ & టర్న్ తీసుకొస్తుంది' అని చెప్పుకొచ్చాడు. ఇంతకీ తారక్ పొన్నప్ప చేసిన రోల్ ఏంటనేది మూవీ రిలీజైతే గాని తెలియదు.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)పాట్నాలో ఆదివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా.. ఇదిప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయింది. ఎందుకంటే లక్షకు పైగా జనాలు అల్లు అర్జున్‌ని చూడటానిక వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి.(ఇదీ చదవండి: కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి.. ప్రీ వెడ్డింగ్ ఫొటో వైరల్)


