మమిత పెళ్లిపై నిర్ణయం అతడిదే.. ఈమె రియాక్షన్ ఇది | Mamitha Baiju Her Wedding Decision By Brother | Sakshi
Sakshi News home page

Mamitha Baiju: పెళ్లిపై రూమర్స్.. మమిత ఏమందంటే?

Oct 12 2026 6:18 PM | Updated on Oct 12 2026 6:21 PM

Mamitha Baiju Her Wedding Decision By Brother

ప్రస్తుతం దక్షిణాదిలో ట్రెండింగ్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది మమిత బైజునే. తెలుగు, తమిళ, మలయాళ సినిమాలతో ఎప్పటికప్పుడు కనిపిస్తూ ప్రేక్షకులని పలకరిస్తోంది. రీసెంట్ టైంలో అయితే జన నాయగణ్, విశ్వనాథ్ అండ్ సన్స్, బెత్లెహెమ్ కుడుంబ యూనిట్ చిత్రాలతో వచ్చింది. పలు తెలుగు చిత్రాల్లో హీరోయిన్‌గా ఈమెని తీసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. ఇవలా ఉండగానే పెళ్లిపై వస్తున్న పుకార్లపై మమిత స్పందించింది.

(ఇదీ చదవండి: అందుకే షాలినిని ఉంచి నన్ను పంపించేశారు: చరణ్‌)

మమితా బైజు జీవితంలోని ప్రతి నిర్ణయాన్ని, ముఖ్యంగా ఆమె ఎవరిని పెళ్లి చేసుకోవాలనే దానిని ఆమె సోదరుడు మిథున్ బైజునే నిర్ణయిస్తాడని వరుసగా పోస్ట్‌లు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. వీటిలో ఒకదానికి స్పందించిన మమిత.. ఫన్నీగా ‘వాట్‌’ అనే స్టికర్‌ని రిప్లై ఇచ్చింది. దీంతో ఇదికాస్త సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

ప్రస్తుతం మమిత తమిళంలో విష్ణు విశాల్ హీరోగా చేసిన 'ఇరండు వానం'లో నటించింది. దీనితో పాటు భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న  ‘జై హనుమాన్‌’లోనూ ఈమెకు అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. ఇందులో ఓ కీలక పాత్ర కోసం చిత్రబృందం మమితా బైజును రంగంలోకి దించినట్లు మాట్లాడుకుంటున్నారు.

(ఇదీ చదవండి: దసరా మూవీస్.. హైప్ ఎలా ఉంది?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement