బిగ్‌బాస్ తెలుగు 10 ఐదో వారం ముగిసింది. ఈ వారం అపూర్వ, చరణ్ మహాదేవ్ ఎలిమినేట్ కాగా.. ఐదుగురు కొత్త కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టారు. శివ్, దక్ష, నీతూ మాస్టర్, శ్వేతా నాయుడు, రామకృష్ణ ఎంట్రీతో ఇంటి వాతావరణం మారిపోయింది. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన చరణ్.. తన జర్నీ, హౌస్‌లోని పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
హౌస్‌మేట్స్ ఓటింగ్‌తోనే ఎలిమినేషన్
ప్రేక్షకుల ఓట్లతో రెండుసార్లు హౌస్‌లోకి వచ్చా. కానీ రెండు సార్లూ హౌస్‌మేట్స్ నిర్ణయం వల్లే బయటకు వచ్చా. ఈ సారి టాస్క్‌ల ప్రదర్శన మెరుగుపడిన టైంలోనే ఎలిమినేట్ కావడం బాధగా ఉంది. రీఎంట్రీ అవకాశం చాలా తక్కువ మందికి మాత్రమే వస్తుంది. నాకు, చైత్రకు ఈ అవకాశం దొరికింది. అగ్నిపరీక్ష నుంచి మొదలైన నా ప్రయాణంలో ప్రేక్షకులు చూపించిన ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను. అప్పటి నుంచి ఇప్పటివరకు మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు అని తెలిపాడు.
కామన్స్ వర్సెస్ సెలబ్రిటీలు
హౌస్‌లో కామన్స్, సెలబ్రిటీల మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపించిందని చరణ్ అభిప్రాయపడ్డాడు. అందరూ కలిసిమెలిసి ఉన్నప్పటికీ ఓటింగ్ విషయానికి వచ్చేసరికి సెలబ్రిటీలు తమవారికి, కామన్స్ తమవారికి మద్దతుగా నిలుస్తారని చెప్పాడు. కెప్టెన్సీ సమయంలోనూ ఈ విషయం బయటపడిందని పేర్కొన్నాడు.షాలిని, రోహిత్ మధ్య ఉన్న బంధం గురించి స్పందిస్తూ.. అది వారి వ్యక్తిగత విషయమని, తాను అందులో జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశాడు.
షాలినిని ఉంచి తనను పంపించారా?
నన్ను బయటకి పంపించేందుకు బలమైన కారణాలు చెప్పలేదు. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు షాలినిని టార్గెట్ చేయడం చూస్తుంటే.. ఆమెకు బయట నెగటివిటీ ఎక్కువగా ఉందని హౌస్‌మేట్స్ భావించవచ్చు. అందుకే షాలినిని హౌస్‌లో తనని ఉంచి నన్ను బయటకు పంపించి ఉండవచ్చు’అని అభిప్రాయ పడ్డాడు.
(ఇదీ చదవండి: 28 రోజుల తర్వాత ఇంటికి.. యూట్యూబర్ భావోద్వేగ పోస్ట్)


