28 రోజుల తర్వాత ఇంటికి.. యూట్యూబర్‌ భావోద్వేగ పోస్ట్‌ | YouTuber Nandu Viral Post: Nandana Returns Home After 28 Days, Shares Her Message | Sakshi
Sakshi News home page

YouTuber Nandu Viral Post: ఎంతో బాధ అనుభవించా.. సత్యమే గెలుస్తుంది: యూట్యూబర్‌ నందు

Oct 12 2026 4:39 PM | Updated on Oct 12 2026 4:48 PM

YouTuber Nandu Viral Post: Nandana Returns Home After 28 Days, Shares Her Message

నందూస్‌ వరల్డ్‌ యూట్యూబర్‌, నటి నందన గత కొద్ది కాలంగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలతో ఆమెపై గతంలో కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఆమె తాజగా సోషల్‌ మీడియాలో చేసిన భావోద్వేగ పోస్ట్‌ ఆసక్తికరంగా మారింది. 28 రోజుల తర్వాత కుటుంబ సభ్యుల వద్దకు చేరుకున్న ఆమె..  ఈ సమయంలో ఎదురైన అనుభవాలు నేర్చుకున్న పాఠాలు గుర్తుచేసుకుంది.

చేదు జ్ఞాపకాలతో కాకుండా..
‘28 రోజుల తర్వాత అక్టోబర్‌ 4న నా కుటుంబం వద్దకు తిరిగి వచ్చాను. ఈ 28 రోజులు నాకు ఎన్నో విషయాలు నేర్పించాయి. నిజాయతీగా ఉండటం, సత్యం కోసం నిలబడటం, మనలోని ధైర్యాన్ని నమ్ముకోవడం ఎంత ముఖ్యమో తెలుసుకున్నాను. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. బాధను అనుభవించాను. కానీ చేదు జ్ఞాపకాలతో కాకుండా విలువైన పాఠాలు, ధైర్యం, ఆశతో తిరిగి వస్తున్నాను.

నిజాయతీగా ఉండే మనుషులు ఇప్పటికీ ఉన్నారు. సత్యానికి ఇంకా విలువ ఉంది. మన విలువలను కాపాడుకోవడం ఎప్పుడూ వృథా కాదు. జీవితంలో అనుకోని పరీక్షలు ఎదురైనప్పటికీ.. వాటి కారణంగా మన విలువలను కోల్పోకూడదు. ఈ అనుభవం జీవితాంతం గుర్తుండిపోయే పాఠాలను నేర్పించింది. నన్ను మరింత బలంగా మార్చింది. ఈ దసరా పండుగకి ఓ విషయాన్ని గుర్తు చేయాలి. చీకటి ఎంత బలంగా కనిపించినా.. చివరికి సత్యం, మంచితనమే గెలుస్తాయి’ అని నందన తన పోస్ట్‌లో పేర్కొంది.

కాగా మెగాస్టార్‌ చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్‌ సినిమాలో ఈమె కీలక పాత్రలో కనిపించారు. తన నటనతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

(ఇదీ చదవండి: ‘ఇరుముడి గాయిత్రి గుర్తుందా.. సంప్రదాయ దుస్తుల్లో ఫొటోలు చూశారా?)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement