అప్పుడు భయపెట్టాడు.. ఇప్పుడు తెగ నవ్వించాడు | Bethlehem Kudumba Unit Baiju Original Name And Details | Sakshi
Sakshi News home page

Guess The Actor: 'బెత్లెహోమ్..' వల్ల 26 ఏళ్ల క్రితం సంగతి రివీల్

Oct 7 2026 11:01 AM | Updated on Oct 7 2026 11:08 AM

Bethlehem Kudumba Unit Baiju Original Name And Details

అప్పుడప్పుడు కొన్ని సినిమాలు తెగ వైరల్ అయిపోతుంటాయి. అలాంటి ఓ మూవీనే 'బెత్లెహెమ్ కుడుంబ యూనిట్'. ఇదో మలయాళ చిత్రం. గత నెలలో థియేటర్లలో రిలీజై ఓ మాదిరిగా ఆకట్టుకుంది. కానీ గత వీకెండ్ హాట్‌స్టార్ ఓటీటీలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా అంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. మమిత ఎప్పటిలానే ట్రెండ్ అవగా.. మిగిలిన పాత్రధారులకు సంబంధించిన విషయాలు కూడా బయటపడుతున్నాయి. అలా ఓ షాకింగ్ డీటైల్ రివీల్ అయింది.

(ఇదీ చదవండి: 'ప్యారడైజ్' ఎఫెక్ట్.. చిరుతో సినిమాపై నాని కామెంట్స్)

'బెత్లెహెమ్ కుడుంబ యూనిట్' మూవీలో బైజు అనే పాత్రలో కనిపించి తెగ నవ్వించిన నటుడు.. 26 ఏళ్ల క్రితం వచ్చిన ఓ తెలుగు డబ్బింగ్ మూవీతో గజగజా భయపెట్టాడని మీలో ఎంతమందికి తెలుసు. అవును రోజా ప్రధాన పాత్ర చేసిన 'దుర్గా' సినిమా 2000లో రిలీజైంది. ఇందులో భయంకరంగా ఉంటూ భయపెట్టిన విలనే ఇప్పుడు 'బెత్లెహెమ్ కుడుంబ యూనిట్'లో బైజుగా కనిపించాడు. అతడి అసలు పేరు సురేశ్ కృష్ణ.

2000 నాటి మూవీలో ఉన్నది.. ఇప్పుడు ఈ సినిమాలో ఉన్నది నేనే అని స్వయంగా సురేశ్ కృష్ణనే ఇన్ స్టాలో పోస్ట్ పెట్టి క్లారిటీ ఇచ్చాడు. ఈ నటుడి కెరీర్ విషయానికొస్తే.. 1993 నుంచి సినిమాల్లో నటిస్తున్నాడు. కాకపోతే దుర్గా(తమిళంలో 'పొట్టు అమ్మన్') చేసిన తర్వాత వరస అవకాశాలు ఇతడిని వరించాయి. అలా సహాయ పాత్రలు బోలెడన్ని చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు బెత్లెహెమ్ కుడుంబ యూనిట్' ఓటీటీ రిలీజ్ వల్ల తెలుగు నెటిజన్లకు ఆప్తుడు అయిపోయాడు. 1998-2007 మధ్య మలయాళ టీవీ సీరియల్స్‌లోనూ ఇతడు నటించడం విశేషం.

(ఇదీ చదవండి: ‘బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌’ మూవీ రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement