breaking news
suresh krishna
-
వెబ్ సిరీస్‌కి ఆ స్వేచ్ఛ ఉంది: సురేష్ కృష్ణ
సాక్షి, చెన్నై: వెబ్ సిరీస్‌లపై జనంలో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రముఖ దర్శక నిర్మాతలు కూడా వెబ్ సిరీస్‌పై దృష్టి సారిస్తున్నారు. దర్శకుడు సురేష్ కృష్ణ కూడా వెబ్ సిరీస్ ప్రపంచంలోకి అడుగుపెట్టేశారు. రజనీకాంత్ నటించిన భాషాతో మంచి పేరు తెచ్చుకున్న ఈయన తమిళం, తెలుగు, మలయాళం, హిందీ తదితర భాషల్లో పలు విజయవంతమైన చిత్రాలను అందించారు. తరువాత బుల్లితెరపై తన విజయ పరంపరను కొనసాగించారు. మహాభారతి వంటి ఇతిహాసంతో బుల్లితెర ప్రేక్షకులను కనువిందు చేశారు. తాజాగా వెబ్‌సిరీస్‌పై దృష్టి సారించారు. ఆయన సురేష్ కృష్ణ ప్రొడక్షన్స్ ప్రైవేటు లిమిటెడ్ పతాకంపై ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ పేరుతో తెలుగులో వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. విద్యాసాగర్ ముత్తుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ ఇప్పుడు ఆహా ప్లాట్‌ఫాం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ సీరియల్ ఈ సిరీస్‌ను నిర్మించినట్లు తెలిపారు. 40 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించి, పలు టీవీ సీరియల్ నిర్మించిన సురేష్‌కృష్ణ ఇప్పుడు వెబ్‌సిరీస్ రూపొందించడం గురించి మాట్లాడుతూ రాజీ పడకుండా అనుకున్నది అనుకున్నట్లుగా రూపొందించే సౌలభ్యం వెబ్‌సిరీస్‌కు ఉందన్నారు. అదే విధంగా సినిమాలు, టీవీ సీరియల్స్‌ను చూపించడంలో లేని స్వేచ్ఛ వెబ్‌సిరీస్‌కు ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. చదవండి : ఆ నటుడిని హాఫ్ బాయిల్ అన్న గూగుల్! -
ఒక్క సినిమాతో వంద సినిమాలు పుట్టించిన బాషా
బాషాలో మంచి సీన్ ఉంటుంది.రజనీకాంత్ చెల్లెలికి మెడిసిన్‌లో సీట్ కావాల్సి వస్తుంది. ఫ్రీ సీట్లు అయిపోయి ఉంటాయి. కాలేజీ ఓనరు ‘ఇక మిగిలింది నా చేతిలో ఉన్న ప్రయివేటు సీట్లే’ అంటాడు.‘ఆ సీటు కావాలంటే నువ్వు కాలేజీతో పాటు అప్పుడప్పుడు గెస్ట్‌హౌస్‌కు వచ్చిపోతుండాలి’ అని అంటాడు.ఈ మాటతో హతాశురాలైన రజనీకాంత్ చెల్లెలు క్యాంటీన్లో కూచుని కన్నీరు పెట్టుకుంటూ రజనీకాంత్‌తో అంటుంది– ‘కాలేజీకెళ్లి చదువుకోవచ్చు, హాస్టల్లో ఉండి చదువుకోవచ్చు, కాని గెస్ట్‌హౌస్‌కు వెళ్లి ఎలా చదవమంటావ్ అన్నయ్యా’. రజనీకాంత్ అప్పుడు ఆ అమ్మాయిని తీసుకుని కాలేజీ ఓనర్ దగ్గరకు వెళతాడు.‘ఏరా బెదిరించడానికి వచ్చావా నేనే పెద్ద రౌడీని’ అంటాడు ఓనర్.అప్పుడు రజనీకాంత్ అందరినీ బయటకు పంపించేసి ‘అయ్యా... నా పేరు మాణిక్యం’ అని టేబుల్ మీద చేతులు పెట్టి ముందుకు వొంగుతాడు.‘నాకు ఇంకో పేరు కూడా ఉంది’ అంటాడు.అంతే. ఆర్.ఆర్ మొదలవుతుంది. లోపల ఏం మాట్లాడుతున్నాడో మనకు వినిపించదు.అద్దాల గదిలో కాలేజీ ఓనరు సీట్లో నుంచి లేచి నిలుచోవడం, చెమటలు కక్కడం, రజనీకాంత్ ముందు చేతులు కట్టుకుని వణకడం... ప్రేక్షకులకు చాలా సంతృప్తిని, అహం తృప్తిని కలిగిస్తుంది.‘మా హీరో అంటే ఏమనుకుంటున్నావురా’.. అని వాళ్లు అనుకుంటారు. అతడు ఫ్లాష్‌బ్యాక్‌లో చాలా పెద్ద డాన్. తుపాకులతో, బుల్లెట్లతో ఆడుకున్నవాడు. అలాంటివాడు అజ్ఞాతంలో ఒక ఆటోవాడిలాగా బతుకుతుండొచ్చు. కాని పులి బోనులో ఉన్నంత మాత్రాన పులి కాకుండా పోతుందా?ఘనమైన ఫ్లాష్‌బ్యాక్ ఉండి కూడా అతి సామాన్యంగా బతుకుతున్న హీరో మళ్లీ జమ్మి చెట్టు మీద నుంచి అస్త్రాలు దించే తీరుతాడు అని ఎదురు చూసేలా చేసే ఫార్ములా ఇది.భారతం నుంచి బాషా వరకు ఆ ఫార్ములా సక్సెస్ అవుతూనే ఉంది. బాషాలో రజనీకాంత్ ఒక సరదా అయిన సగటు మనిషిలా మొదట కనిపిస్తాడు. కాని అతడిది అది అసలు రూపం కాదని ప్రేక్షకులకు తెలుస్తూనే ఉంటుంది. ఒక గొప్ప వీరుడు మారువేషంలో అజ్ఞాతంలో ఉన్నాడని దర్శకుడు హింట్స్ ఇస్తూ ఉంటాడు. ఆ పాత్రను ప్రేక్షకులే కాదు సాటి పాత్రలు కూడా తలెత్తి చూసేలా ఒక సన్నివేశం పెడతాడు. రజనీకాంత్ తమ్ముడికి పోలీస్ ఉద్యోగం వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో కమిషనర్‌కు డౌట్ వస్తుంది. ‘మీ అన్నను రమ్మను’ అంటాడు. అప్పటికే ముంబై రికార్డ్స్‌లో బాషా మరణించాడని ఉంటుంది. ముంబైలో పని చేసి వచ్చిన ఆ కమిషనర్‌కు బాషా తెలుసు. ఇక్కడ ఉన్నది ఆ బాషాయేనా తెలుసుకోవడానికి రమ్మంటాడు. పెద్ద ఆఫీస్ రూమ్ అది.రజనీకాంత్ ఆటోవాలాలా ఎంట్రీ ఇస్తాడు. ఒక్కసారిగా కమిషనర్ లేచి నిలబడతాడు. పక్క పాత్రలూ ప్రేక్షకులు కూడా. మారువేషంలో ఉన్నది భీముడు అని కీచకుడు కనిపెట్టి అదిరిపడితే ఎలాంటి మజా వస్తుందో ఇక్కడ కూడా అలాంటి మజాయే ప్రేక్షకులకు వస్తుంది. రజనీకాంత్, చరణ్‌రాజ్ ముంబైలో స్నేహితులు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. కాని ఆ ప్రాంతంలో డాన్ అయిన రఘువరన్ మురికివాడను ఖాళీ చేయిస్తుంటే రజనీకాంత్, చరణ్‌రాజ్ అడ్డు పడతారు. చావు ఎదురైనా ఇద్దరం కలిసే ఈ అన్యాయాన్ని ఎదిరిద్దాం అనుకుంటారు. కాని రఘవరన్ చాలా దుర్మార్గుడు. తన దగ్గర పని చేసే మేనేజర్ విజయకుమార్ కొడుకు కాబట్టి రజనీకాంత్‌ని వదిలిపెట్టి చరణ్‌రాజ్‌ను దారుణంగా హత్య చేయిస్తాడు. చరణ్‌రాజ్ పేరు అన్వర్ బాషా. చరణ్ రాజ్ మృతదేహం ఖననం అయ్యేలోపు రజనీకాంత్ అతణ్ణి చంపిన ప్రతి ఒక్కరినీ నరుకుతాడు. బస్తీ వాసులంతా ఈ దుష్ట శిక్షణకు జేజేలు పలుకుతారు. ఆ రోజు నుంచి రజనీకాంత్ తన పేరును మాణిక్ బాషాగా మార్చుకొని ముంబైలో పెద్ద డాన్‌గా మారుతాడు. కాని రఘువరన్‌కు, రజనీకాంత్‌కు మధ్య గొడవలు పెరిగిపోయి ఆ గొడవల్లో తండ్రి ప్రాణమే పోయే పరిస్థితి వచ్చేసరికి తండ్రి చివరి కోరిక మేరకు నేర జీవితం వదిలేసి చెన్నై చేరుకుని మామూలు జీవితం గడుపుతుంటాడు రజనీకాంత్. కాని తిరిగి పాత రూపం చూపించే పరిస్థితి వస్తుంది. ఒక లోకల్ రౌడీ తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుంటే మాణిక్యం అవతారం చాలించి తిరిగి బాషా అవతారంలోకి వెళతాడు రజనీకాంత్.ఆ సన్నివేశం సినిమాలో ముఖ్యమైనది. అంతకు ముందు సన్నివేశాలలో ఆ రౌడీని చూసి రజనీకాంత్ భయపడినట్టుగా కనిపిస్తాడు. మనకెందుకు గొడవ అన్నట్టు పక్కకు తప్పుకుంటుంటాడు. చివరకు ఆ రౌడీ తనను స్తంభానికి కట్టేసి చితక బాదినా సహిస్తాడు. కాని ఎప్పుడైతే చెల్లెలి మీద ఆ రౌడీ చేయి వేస్తాడో... ఒకే గుద్దు... రౌడీ ఎగిరి కరెంట్ పోల్‌ను ఢీకొని కిందపడతాడు.రజనీకాంత్ మాణిక్యం అవతారాన్ని చాలించి తిరిగి బాషాగా మారాడన్న సంగతి తెలియగానే తల్లి అక్కడి నుంచి అందరినీ తీసుకెళ్లిపోతుంది. ప్రేక్షకుల రోమాలు నిక్క పొడుచుకుంటాయి. కేరెక్టర్ ఇమేజ్ ఆకాశానికి అంటుతుంది. ఇంతకుముందు సినిమాల్లో ఇలాంటి అనుభూతి లేదు.ఇది బాషా ఫార్ములా అనుభూతి. పాండవులు మారువేషంలో బతకడం సామాన్య జనులకు ఎంత అబ్బురమో హీరోలు మారువేషంలో బతకడం కూడా అంతే అబ్బురం. ఇచ్చిన మాటకు, విలువకు కట్టుబడి కుటుంబం కోసం సాధారణ జీవితం గడపడానికి వచ్చిన బాషా తిరిగి పాత రూపంలోకి వెళ్లి శత్రుశేషం ఎలా నిర్మూలించుకున్నాడన్నది క్లయిమాక్స్.సాధారణంగా సినిమాలు ముగిశాక శుభం కార్డు పడుతుంది. కాని బాషా ముగిశాక కూడా శుభం కార్డు పడలేదు. ఆ సినిమా కథ ముగియలేదు. ఇప్పటికీ అనేక కథలను పుట్టిస్తూనే ఉంది. ‘నేను ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్టే’ అనేది ఇందులో పంచ్ డైలాగ్. ఒక్కసారి రిలీజైనా వంద విధాలుగా రీరిలీజ్ అవుతున్నదే– బాషా. ‘హమ్’ నుంచి స్ఫూర్తి పొంది... సురేశ్ కృష్ణ దర్శకత్వంలో 1995లో విడుదలైన ‘బాషా’ చాలా పెద్ద విజయం సాధించింది. ఒక రకంగా రజనీకాంత్ కెరీర్‌ని ఇంకో ఇరవై ఏళ్లు పొడిగించిన సినిమా ఇది. రజనీకాంత్ ఇమేజ్ భారీగా పెరడగానికి ఈ సినిమా ముఖ్యకారణం. దీని తర్వాత రజనీకాంత్ మల్టీ స్టారర్ హిందీ సినిమాలు మానుకొని సంవత్సరంలో రెండు మూడు సినిమాలు చేయడం మానుకొని ఒక్కసారికి ఒక్క సినిమా పద్ధతిలోకి వెళ్లి తన మార్కెట్ బాగా పెంచుకోగలిగాడు. 1991లో వచ్చిన ‘హమ్’ సినిమాలో నటించడం రజనీకాంత్‌కు లాభించింది. ఆ సినిమాలో అమితాబ్ ఇలాగే పెద్ద డాన్‌గా ఉండి అన్నీ మానేసి కుటుంబం కోసం అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోతాడు. ఆ పాయింట్‌ను ‘బాషా’ కోసం కొత్తగా డెవలప్ చేసుకున్నాడు రజనీకాంత్. మంచి వయసు, ఆరోగ్యం ఉన్న రోజులలో వచ్చిన సినిమా కాబట్టి ఇందులో రజనీ పూర్తి ఎనర్జిటిక్‌గా కనిపిస్తాడు. ‘ప్రేమికుడు’తో తెర మీదకు వచ్చిన నగ్మా ఈ సినిమాతో రజనీ పక్కన నటించే చాన్స్ కొట్టేసింది. దేవా పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ అయ్యాయి. ఇక ‘నేను ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్టే’ డైలాగ్ ఎన్ని సినిమాలలో ఎన్ని స్పూఫులుగా వచ్చిందో తెలుసు. ‘బాషా ఫార్ములా’ ధోరణి ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’, ‘ఇంద్ర’ సినిమాల్లో మనం చూస్తాం. బాషా డిజిటల్లీ ఇంప్రూవ్డ్ ప్రింట్‌ను 2017లో విడుదల చేశారు. 20 ఏళ్ల తర్వాత కూడా ఒక సినిమా రీరిలీజ్ అయ్యిందంటే అది బాషాకు మాత్రమే దక్కిన ఘనత. - సురేశ్ కృష్ణ, దర్శకుడు – కె -
బాషా-2లో అజిత్?
బాషా. ఇది రజనీకాంత్, దర్శకుడు సురేష్‌కృష్ణ సినీకేరీర్లోనూ మరచిపోలేని చిత్రం. అంతేకాదు తమిళ చిత్రపరిశ్రమలోనే ఒక మైలురాయి. దర్శకుడు సురేష్‌కృష్ణ ఎక్కడికి వెళ్లినా బాషా చిత్రానికి సంబంధించిన ప్రశ్నల నుంచి తప్పికోలేరు. అంతగా ఆయనకు పేరు ప్రఖ్యాతులు ఆపాధించి పెట్టిన చిత్రం అది. అలాంటి చిత్రానికి సీక్వెల్ తీయాలని ఏ దర్శకుడికైనా ఉంటుంది. అయితే ఇది కత్తి మీద సాము అన్న సంగతి తెలిసిందే. అయినా బాషా-2 రూపొందించాలన్నది సురేష్‌కృష్ణ కోరిక. రజనీ ఓకే అంటే బాషా పార్టు 2 తీస్తానని బహిరంగంగానే ప్రకటించారు. ఆ పట్టుదలతోనే బాషా సీక్వెల్‌కు కథ సిద్ధం చేశారు. ఈ విషయాన్ని మన సూపర్‌స్టార్‌కు తెలిజేశారు కూడా. అయితే బాషా ఒక్కడే మరో బాషాను కలలో కూడా ఊహించుకోలేనని రజనీకాంత్ అన్నారట. దీంతో ప్రత్యామ్నాయ దిశగా దృష్టి సారించిన దర్శకుడు సురేష్‌కృష్ణ. ఆయనకు అజిత్ ఒక్కరే కనిపించారట. అజిత్ ఇంతకు ముందు రజనీకాంత్ నటించిన బిల్లా చిత్ర రీమేక్‌లో నటించే సాహసంచేసి విజయం సాధించారు. అదీకాకుండా బాషా లాంటి గ్యాంగ్‌స్టర్ పాత్రలకు ప్రస్తుత నటుల్లో ఆయనే గుడ్ ఛాయిస్ అనుకున్నారు. బాషా-2 స్క్రిప్ట్‌ను అజిత్‌కు వినిపించారని, ఆయన నటించడానికి సమ్మతించినట్లు కోలీవుడ్ వర్గాల బోగట్టా. అజిత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో ఏఎం.రత్నం నిర్మిస్తున్న భారీ చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి కేవీ ఆనంద్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు అనధికార ప్రచారం జరుగుతోంది. మరి బాషా సీక్వెల్ తెరరూపం దాల్చేదెప్పుడో? అసలు ఈ చిత్రం ఉంటుందో? లేదో? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. -
మరోసారి బాషాగా..?
‘ఈ బాషా ఒక్కసారి చెబితే... వంద సార్లు చెప్పినట్టే’... 1995లో ఎక్కడ విన్నా ఇదే డైలాగ్. ఆ మాటకొస్తే... ఇప్పటికీ ఆ డైలాగ్‌ని ఎవరూ మర్చిపోలేదు. రజనీ స్టైల్‌గా డైలాగ్ చెబితే అలానే ఉంటుంది మరి. మాస్ చిత్రాల్లో ‘బాషా’... నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన సినిమా. ‘బాషా’ మార్క్ స్క్రీన్‌ప్లేతో దక్షిణాదిన లెక్కకు మించిన సినిమాలొచ్చాయి. తెలుగు ప్రేక్షకులకు అప్పటికే సుపరిచితుడైన రజనీకాంత్‌ని, ఇక్కడ కూడా సూపర్‌స్టార్‌గా నిలబెట్టిన సినిమా ‘బాషా’. అందుకే... ఇక్కడి ప్రేక్షకులకు కూడా ఈ సినిమా అంటే ప్రత్యేకమైన అభిమానం. ఇప్పటికీ ఈ సినిమా టీవీల్లో వస్తే... రేటింగ్ ఓ రేంజ్‌లోనే ఉంటుంది. ఇప్పుడీ చిత్రం సీక్వెల్‌కి సన్నాహాలు మొదలయ్యాయట. దర్శకుడు సురేశ్‌కృష్ణ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నారని వినికిడి. ఇటీవలే సూపర్‌స్టార్‌తో కూడా ఈ విషయంపై చర్చించారట సురేశ్‌కృష్ణ. అయితే... రజనీకాంత్ మాత్రం భిన్నంగా స్పందించారని సమాచారం. కేవలం తమిళనాటకే పరిమితమైన తన స్టార్‌డమ్‌ని దేశవ్యాప్తం చేసిన సినిమా ‘బాషా’ అనీ, ఆ సినిమా సీక్వెల్ అంటే సాదాసీదా వ్యవహారం కాదని సురేశ్కృష్ణతో రజనీ అన్నారని బోగట్టా. అయినా, సురేశ్‌కృష్ణ మాత్రం కొండంత పట్టుదలతో సూపర్‌స్టార్‌ని మెప్పించే స్క్రిప్ట్ తయారు చేసే పనిలో నిమగ్నం అయ్యారట. అన్నీ కుదిరితే త్వరలోనే మళ్లీ ‘బాషా’గా సూపర్‌స్టార్‌ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు చూస్తారనమాట. -
7 నుంచి నిర్మాణ పనులు ఆపేస్తాం
చెన్నై: భారీగా పెరిగిన సిమెంట్ ధరలపై భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పెరిగిన 25 శాతం ధర తగ్గించాలని, లేకుంటే జూలై 7 నుంచి దక్షిణ భారత్ లో నిర్మాణాలు నిలిపివేస్తామని హెచ్చరించింది. ధరల పెంపు అసమంజసంగా ఉందని క్రెడాయ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఉపాధ్యక్షుడు, కన్వీనర్ సురేష్ కృష్ణ ఆరోపించారు. సిమెంట్ ఉత్పత్తిలో ముడిసరుకు, విద్యుత్, కూలీల ఖర్చులు పెరగకుండానే అనూహ్యంగా ఉత్పత్తిదారులు ధరలు పెంచారన్నారు. జూన్ 1 నుంచి సిమెంట్ ధర 25 శాతం(బస్తాకు రూ.70) పెరిగిందని తెలిపారు. పెంచిన ధరలు తగ్గించకుంటే ఈనెల 30 నుంచి సిమెంట్ బస్తాలు కొనొద్దని తమ సభ్యులను కోరనున్నట్టు వెల్లడించారు. -
బుల్లితెరపై అర్చన
మనకున్న అద్భుతమైన నటీమణుల్లో అర్చన ఒకరు. ఈమె నటించిందంటే తెరపై పాత్ర మాత్రమే కనిపిస్తుంది. అలా ఎన్నో పాత్రలకు జీవం పోసిన గొప్ప నటి అర్చన. ఈమె నటనకు దూరమై చాలా కాలమైంది. ఈమెను నటింపజేయూలని చాలా మంది దర్శక నిర్మాతలు ప్రయత్నించి విఫలమయ్యూరు. అలాంటి నటిని సీనియర్ దర్శకుడు సురేష్‌కృష్ణ బుల్లి తెరపైకి తీసుకురావడం విశేషం. వీరిద్దరి కాంబినేషన్లో ఉనర్వుగళ్ అనే మెగా సీరియల్ రూపొందుతోంది. ఉనర్వుగళ్ సీరియల్ మిమ్మల్ని మీరే చూసుకునే కథ అన్నారు దర్శకుడు సురేష్‌కృష్ణ. బుల్లితెర సీరియల్‌గా కాకుండా వెండితెరపై చిత్రం చూస్తున్న అనుభూతి కలుగుతుందని పేర్కొన్నారు. ఈ సీరియల్ సోమవారం నుంచి పుదుయుగం టీవీలో ప్రసారమవుతుందని తెలిపారు. దేవా సంగీతం అందించారని వివరించారు.