మరోసారి బాషాగా..? | rajinikanth Basha sequel Suresh Krishna | Sakshi
Sakshi News home page

మరోసారి బాషాగా..?

Oct 12 2014 11:32 PM | Updated on Sep 2 2017 2:44 PM

మరోసారి బాషాగా..?

మరోసారి బాషాగా..?

‘ఈ బాషా ఒక్కసారి చెబితే... వంద సార్లు చెప్పినట్టే’... 1995లో ఎక్కడ విన్నా ఇదే డైలాగ్. ఆ మాటకొస్తే... ఇప్పటికీ ఆ డైలాగ్‌ని ఎవరూ మర్చిపోలేదు. రజనీ స్టైల్‌గా డైలాగ్ చెబితే అలానే ఉంటుంది మరి.

 ‘ఈ బాషా ఒక్కసారి చెబితే... వంద సార్లు చెప్పినట్టే’... 1995లో ఎక్కడ విన్నా ఇదే డైలాగ్. ఆ మాటకొస్తే... ఇప్పటికీ ఆ డైలాగ్‌ని ఎవరూ మర్చిపోలేదు. రజనీ స్టైల్‌గా డైలాగ్ చెబితే అలానే ఉంటుంది మరి. మాస్ చిత్రాల్లో ‘బాషా’... నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన సినిమా. ‘బాషా’ మార్క్ స్క్రీన్‌ప్లేతో దక్షిణాదిన లెక్కకు మించిన సినిమాలొచ్చాయి. తెలుగు ప్రేక్షకులకు అప్పటికే సుపరిచితుడైన రజనీకాంత్‌ని, ఇక్కడ కూడా సూపర్‌స్టార్‌గా నిలబెట్టిన సినిమా ‘బాషా’. అందుకే... ఇక్కడి ప్రేక్షకులకు కూడా ఈ సినిమా అంటే ప్రత్యేకమైన అభిమానం. ఇప్పటికీ ఈ సినిమా టీవీల్లో వస్తే... రేటింగ్ ఓ రేంజ్‌లోనే ఉంటుంది.
 
 ఇప్పుడీ చిత్రం సీక్వెల్‌కి సన్నాహాలు మొదలయ్యాయట. దర్శకుడు సురేశ్‌కృష్ణ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నారని వినికిడి. ఇటీవలే సూపర్‌స్టార్‌తో కూడా ఈ విషయంపై చర్చించారట సురేశ్‌కృష్ణ. అయితే... రజనీకాంత్ మాత్రం భిన్నంగా స్పందించారని సమాచారం. కేవలం తమిళనాటకే పరిమితమైన తన స్టార్‌డమ్‌ని దేశవ్యాప్తం చేసిన సినిమా ‘బాషా’ అనీ, ఆ సినిమా సీక్వెల్ అంటే సాదాసీదా వ్యవహారం కాదని సురేశ్‌కృష్ణతో రజనీ అన్నారని బోగట్టా. అయినా, సురేశ్‌కృష్ణ మాత్రం కొండంత పట్టుదలతో సూపర్‌స్టార్‌ని మెప్పించే స్క్రిప్ట్ తయారు చేసే పనిలో నిమగ్నం అయ్యారట. అన్నీ కుదిరితే త్వరలోనే మళ్లీ ‘బాషా’గా సూపర్‌స్టార్‌ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు చూస్తారనమాట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement