మమితా బైజు మూవీ.. బాక్సాపీస్ వద్ద మరో రికార్డ్ | Mamitha Baiju Bethlehem Kudumba Unit Crosses Rs 300 Crore Globally | Sakshi
Sakshi News home page

Bethlehem Kudumba Unit: మమితా బైజు మూవీ.. మరో క్రేజీ రికార్డ్

Sep 18 2026 5:34 PM | Updated on Sep 18 2026 6:00 PM

Mamitha Baiju Bethlehem Kudumba Unit Crosses Rs 300 Crore Globally

సినిమాల సక్సెస్ కావాలంటే కంటెంట్ మాత్రమే కింగ్ అని మరోసారి రుజువైంది. ఇటీవల మలయాళంలో రిలీజైన చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా వచ్చిన బెత్లెహమ్ కుటుంబ యూనిట్ అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికే మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. తాజాగా మరో మైలురాయి చేరుకుంది. ఈ సినిమా రిలీజైన 27 రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. 

ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్. ఈ మలయాళ రొమాంటిక్ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి   గిరీష్ ఎ. డి. దర్శకత్వం వహించగా.. భావనా ​​స్టూడియోస్ బ్యానర్‌లో నిర్మించారు. ఈ మూవీలో ఫహద్ ఫాసిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ కీలక పాత్రల్లో నటించారు. హీరోయిన్‌ మమితా బైజు నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ సైతం బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ విజయాలతో మమితా బైజు పట్టిందల్లా బంగారమే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక నుంచి ఆమె డైరెక్టర్లకు లక్కీ హీరోయిన్‌గా కనిపించడం ఖాయమని తెలుస్తోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement