టాలీవుడ్ హీరో శ్రీనందు, లక్ష్మీ ప్రధాన పాత్రల్లో వస్తోన్న మూవీ మగాళ్లు జిందాబాద్. ఈ సినిమాకు నారా ప్రవీణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని గోల్డెన్ ఆర్క్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రసాద్ భాస్కర్ల, చైతన్య వంగవరపు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈ టైటిల్ చూస్తుంటే మగాళ్ల జీవితాల నేపథ్యంలోనే కథ ఉండనుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నట్లు పోస్టర్స్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ చిత్రంలో వైవా హర్ష, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాలా, మదిన్ ఎస్‌కే సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు.


