జాంబీల ప్రపంచంలోకి ఉపేంద్ర ఎంట్రీ | Upendra From Zombie Reddy 2 First Look Poster Release | Sakshi
Sakshi News home page

జాంబీల ప్రపంచంలోకి ఉపేంద్ర ఎంట్రీ

Sep 18 2026 12:14 PM | Updated on Sep 18 2026 12:45 PM

Upendra From Zombie Reddy 2 First Look Poster Release

తేజ సజ్జా హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘జాంబీ రెడ్డి2’.  2021లో విడుదలైన ‘జాంబీ రెడ్డి’కి సీక్వెల్‌గా రూపొందిస్తున్నారు. సుపర్ణ్‌ ఎస్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆరోజు(సెప్టెంబర్‌ 18) ఉపేంద్ర పుట్టినరోజు కావడంతో ఈయనకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని చిత్రం బృందం విడుదల చేసింది. పోస్టర్‌లో ఆయన చెట్టుకు తలకిందులుగా వేలాడుతున్న ఫొటో సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.

కాగా బాలనటుడిగా అందరి ప్రశంసలు పొంది ‘జాంబీ రెడ్డి’తో హీరోగా పరిచయమయ్యాడు తేజ సజ్జా.  అతని పుట్టినరోజు(ఆగస్టు23)న పీపుల్స్‌ మీడియా అభిమానులకు ‘జాంబీ రెడ్డి నెక్ట్స్ లెవల్‌’ అంటూ ‘జాంబీ రెడ్డి’కి సీక్వెల్‌ రోబోతోందటూ ప్రకటించింది. మూవీ అప్‌డేట్‌ వచ్చిన నుంచి సినిమా రిలీజ్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి గౌర హరి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ 2027లో ప్రేక్షకులను పలకరించనుంది. తెలుగు, తమిళం, హిందీ, తదితర భాషల్లో విడుదల కానుంది. 

 Wishing the Real Star @nimmaupendra a very Happy Birthday 💥#ZombieReddy2 NXT LVL will unleash a whole new flavour of madness, menace & mass with his never-before-seen avatar ❤️‍🔥🧟‍♂️

Superhero @tejasajja123 @Suparn @PrasanthVarma #ShanayaKapoor @vishwaprasadtg #KrithiPrasadpic.twitter.com/pSPSdlozwY

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement