విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘రణబాలి’ నుంచి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చింది. అజయ్-అతుల్ సంగీతం అందించిన ‘ఎందయ్యా సామి’ పాటను సెప్టెంబర్ 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ పాట అందుబాటులోకి రానుంది.
రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ రణబాలిగా, రష్మిక మందన్న జయమ్మగా కనిపించనున్నారు. 1854–1878 మధ్య బ్రిటిష్ పాలనలో దక్షిణ భారతంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల నేపథ్యంలో కథ సాగనుంది. 130 రోజుల పాటు షూటింగ్ జరిపిన ఈ మూవీ అక్టోబర్ 16, 2026న దసరా సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.


