బయోపిక్ అంటేనే ఓ సవాల్. నిజజీవితంలో తెలిసిన వ్యక్తులను తెరపై వారి పాత్రలో నటించి మెప్పించడం అంత ఈజీ మాట కాదు. వారి హావాభావాలు, నడక, మాట తీరు, బాడీ లాంగ్వేజ్ ఇలా ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే ప్రముఖల బయోపిక్‌లో నటించడం నటీనటులకు సవాల్‌తో కూడుకున్న పని. కొంచం అటు ఇటు అయితే అటు డైరెక్టర్లకి, ఇటు యాక్టర్లకీ ట్రోలింగ్ తప్పదు. అయితే ఇంతటి కఠిన పరీక్షలోనూ కొంతమంది తారలు అలాంటి పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన వారు కూడా ఉన్నారు. బయోపిక్ కథాంశంతో వచ్చి బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమాలూ ఉన్నాయి. ఇలా తెలుగు విడుదలైన సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో కొన్ని మనం చూద్దాం.
మహానటిగా కీర్తి సురేశ్
తెలుగు చిత్ర సీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దిగ్గజ నటి సావిత్రి. ఈమె కోసం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అలాంటి నటి జీవితాన్ని నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం మహానటి. సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ నటించారు. తెరపై సావిత్రిగా కనిపించేందుకు ఆమె చేసిన ప్రయత్నం ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. సినిమా కూడా మంచి ఆదరణ పొందడంతో కీర్తి సురేశ్‌కు ఏకంగా ఉత్తమ నటి జాతీయ అవార్డు అందుకుంది. ఈ సినిమా 2018లో విడుదలై సుమారు 90కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
తలైవిగా కంగనా రనౌత్..
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం తలైవి. ఇందులో కంగనా రనౌత్.. జయలలిత పాత్రలో కనిపించారు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా విడుదల సమయంలో కంగనా లుక్, నటనపై చర్చ జరిగింది. ఈ చిత్రం తమిళ ప్రేక్షకులకు ఆకట్టుకుంది. 2021లో విడుదలైన ఈ చిత్రం సుమారు 50 కోట్లకు పైగా వసూళ్లను రాబెట్టింది.
గుంగూబాయిగా అలియా భట్
ముంబైలోని కామాఠిపుర ప్రాంతంలో ప్రముఖరాలిగా ఎదిగిన గంగూబాయి జీవితంలోని కొన్ని ఘటనల ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన చిత్రం ‘గంగూబాయి కాఠియావాడి’. సాధారణ యువతిగా మొదలై కామాఠిపురంలో ప్రభావవంతమైన వ్యక్తిగా ఎదిగిన గంగూబాయి పాత్రలో అలియా భట్ విభిన్నమైన నటనను ప్రదర్శించారు. ఈ చిత్రానికి అలియాకు మంచి ప్రశంసలు అందాయి. 2022లో విడుదలైన ఈ చిత్రం ఏకంగా 126 కోట్లకు పైగా వసూళ్లను రాబెట్టింది.
గంజన్ సక్సేనాగా జాన్వీ కపూర్
జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’. 2020లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. శరణ్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ మూవీ కార్గిల్ ముద్ధంలో సేవలందించిన భారత వైమానిక దళ అధికారిణి గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. కోవిడ్ కారణంగా థియేటర్లలో విడుదలకానప్పటికీ ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది.
ఎం.ఎస్ సుబ్బులక్ష్మిగా రష్మిక..
ఇప్పుడు ప్రముఖ కర్ణాటక సంగీత విధ్వాంసురాలు ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవితకథ ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్నారు. గౌతమ్ తిన్నునూరి దర్శకత్వంలో రష్మిక ఎం.ఎస్ సుబ్బులక్ష్మిగా నటించనున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను కమల్‌హాసన్ చేతుల మీదుగా లాంచ్ చేశారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నరు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.


