సుబ్బులక్ష్మి అమ్మ సంగీతమే మనకు సందేశం | Rashmika Mandanna is all set to play MS Subbulakshmi Biopic Movie | Sakshi
Sakshi News home page

సుబ్బులక్ష్మి అమ్మ సంగీతమే మనకు సందేశం

Sep 17 2026 1:33 AM | Updated on Sep 17 2026 1:33 AM

Rashmika Mandanna is all set to play MS Subbulakshmi Biopic Movie

అల్లు అరవింద్, కమల్‌హాసన్, రష్మిక, రాక్‌లైన్‌ వెంకటేశ్‌

– కమల్‌హాసన్

‘‘సుబ్బులక్ష్మి అమ్మ సంస్కృతం, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ... ఇలా ఏ భాషలో పాడినా ఆ భాషకే అందం తెచ్చేలా ఆ పాట ఉండేది. తన సంగీతంతో భారతదేశాన్ని, ముఖ్యంగా దక్షిణ భారతదేశాన్ని ఏకం చేసిన సంగీత సామ్రాజ్ఞి. ఆమె సంగీతమే మనకు సందేశం’’ అని కమల్‌హాసన్‌ తెలిపారు. సంగీత సామ్రాజ్ఞి, గాయని ఎంఎస్‌ సుబ్బులక్ష్మి జీవిత చరిత్ర ‘భారతరత్న ఎంఎస్‌ సుబ్బులక్ష్మి’ పేరుతో వెండితెరపైకి రానుంది. 

రష్మిక మందన్న టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో అల్లు అరవింద్, రాక్‌లైన్‌ వెంకటేష్, బన్నీ వాస్‌ నిర్మిస్తున్నారు. బుధవారం ఎంఎస్‌ సుబ్బులక్ష్మి 110వ జయంతి సందర్భంగా ఈ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ను కమల్‌హాసన్‌ చేతుల మీదుగా లాంచ్‌ చేశారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో ర ష్మికా మందన్నపై చిత్రీకరించిన సన్నివేశానికి కమల్‌హాసన్‌ క్లాప్‌ ఇచ్చారు. 

ఈ సందర్భంగా గౌతమ్‌ తిన్ననూరి మాట్లాడుతూ– ‘‘మన దేశపు గొప్ప సంగీత సామ్రాజ్ఞి గురించి సినిమా చేస్తున్నాం’’ అన్నారు. ‘‘సుబ్బులక్ష్మి అమ్మ జీవితంలోని ఘటనల గురించి తెలిశాక ఈ బయోపిక్‌ తీయాలని మరింతగా స్ఫూర్తి పొందాం. నాలుగు దక్షిణ భారత భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తు న్నాం’’ అని చెప్పారు అల్లు అరవింద్‌. ‘‘ఈ సినిమా నిర్మించడం నాకు దక్కిన గౌరవం’’ అన్నారు బన్నీ వాస్‌. 

‘‘ఈ సినిమా వెనక ఏడెనిమిదేళ్ల ప్రయత్నం ఉంది’’ అన్నారు రాక్‌లైన్‌ వెంకటేశ్‌. ‘‘నటిగా గొప్ప చాన్స్‌ దక్కినందుకు కృతజ్ఞతతో మనసు నిండిపో తోంది. అమ్మ జీవిత ప్రయాణంలో చిన్న భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను’’ అని చెప్పారు రష్మిక. ఈ వేడుకలో సినీ ప్రముఖులతో పాటు ఎంఎస్‌ సుబ్బులక్ష్మి మనవడు చంద్రశేఖర్, ఆయన భార్య మణిమాల పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement