గూఢచారి డేట్‌ ఫిక్స్‌ | Adivi Sesh next Movie G2 Released on 5 February 2027 | Sakshi
Sakshi News home page

గూఢచారి డేట్‌ ఫిక్స్‌

Sep 17 2026 1:21 AM | Updated on Sep 17 2026 1:21 AM

Adivi Sesh next Movie G2 Released on 5 February 2027

‘జీ2’ అంటూ అడివి శేష్‌ మళ్లీ గూఢచారిగా విజృంభించడానికి సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా రూపొందిన ‘గూఢచారి’కి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం ‘జీ2’. వినయ్‌ కుమార్‌ సిరిగినీడి దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్‌ ఇండియాగా 2027 ఫిబ్రవరి 5న రిలీజ్‌ చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఏజెంట్‌ 116గా వామికా గబ్బి నటిస్తోన్న ఈ మూవీలో ఇమ్రాన్‌ హష్మీ, మురళీ శర్మ, సుప్రియ యార్లగడ్డ, మధు శాలిని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement