ప్రభాస్‌తో ధురంధర్ దర్శకుడు ఆదిత్య ధర్ | Dhurandhar director Aditya Dhar Movie with Prabhas | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌తో ధురంధర్ దర్శకుడు ఆదిత్య ధర్

Jun 10 2026 11:31 PM | Updated on Jun 10 2026 11:58 PM

Dhurandhar director Aditya Dhar Movie with Prabhas

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పాన్ ఇండియా దర్శకుడు ఆదిత్య ధర్ కలయికపై వార్తలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. సోషల్ మీడియాలో ఈ కాంబినేషన్ గురించి ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. వాళ్లిద్దరూ కలిశారనేది నిజం. కొన్ని ఐడియాస్ షేర్ చేసుకున్నారనేది కూడా నిజం. కానీ ఈ కాంబినేషన్ పై ఎలాంటి కన్ ఫర్మేషన్ లేదు. ఇదే విషయాన్ని పరిశ్రమ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 

ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఓవైపు దర్శకుడు సందీప్‌ వంగాతో స్పిరిట్ షూటింగ్ జరుగుతోంది. మరోవైపు ఫౌజీ సెట్స్ పై ఉంది. వాటితో పాటు కల్కి-2 సినిమా పనులు కూడా కొనసాగుతున్నాయి. అనంతరం సలార్-2 కూడా లైన్‌లో ఉంది. ఇలాంటి బిజీ షెడ్యూల్ మధ్య ప్రభాస్ మరో కొత్త ప్రాజెక్ట్‌కు కాల్షీట్లు కేటాయించే పరిస్థితి లేదు. 

ఇక ఆదిత్య ధర్ విషయానికి వస్తే.. ఆయనకు ఇప్పటికే జియోతో మరో చిత్రానికి కమిట్‌మెంట్ ఉంది. జీ స్టూడియోస్ కూడా ఆయనతో కొత్త ప్రాజెక్ట్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఓటీటీలో విడుదలైన ధురంధర్-2 (ది రివెంజ్) రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ ఫ్రాంచైజీ ఆల్ టైమ్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అందువల్ల ప్రభాస్ – ఆదిత్య ధర్ కాంబినేషన్ పై ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. వీళ్ల మధ్య ఎలాంటి కథా చర్చలు జరగలేదు. కానీ కొన్ని నిర్మాణ సంస్థలు మాత్రం వీళ్లను కలిపే ప్రయత్నం చేస్తున్నాయన్నది మాత్రం నిజం.

Advertisement
 
Advertisement
Advertisement