‘ఖలేజా’, ‘మర్యాద రామన్న’ నా ఫేవరెట్స్: జేసన్ సంజయ్ | CM Vijay Son Jason Sanjay says Khaleja, Maryada Ramanna was His Favorite Movies | Sakshi
Sakshi News home page

‘ఖలేజా’, ‘మర్యాద రామన్న’ నా ఫేవరెట్స్: జేసన్ సంజయ్

Sep 16 2026 11:50 PM | Updated on Sep 16 2026 11:50 PM

CM Vijay Son Jason Sanjay says Khaleja, Maryada Ramanna was His Favorite Movies

కోలీవుడ్ స్టార్ హీరో, ప్రస్తుత తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్‌ నటుడు సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ‘సిగ్మా’ చిత్రంతో ఆయన మెగాఫోన్ పట్టారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తోంది.

ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో జేసన్ సంజయ్ తెలుగు సినిమాలపై తనకున్న అభిమానాన్ని పంచుకున్నారు. టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్ బాబు నటించిన ‘ఖలేజా’, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘మర్యాద రామన్న’ సినిమాలు తన ఆల్‌టైమ్ ఫేవరెట్స్ అని తెలిపారు.

‘మైఖేల్’ సినిమాలో సందీప్ కిషన్ నటన నచ్చడంతోనే ‘సిగ్మా’ కోసం ఆయనను హీరోగా ఎంపిక చేసినట్లు చెప్పారు. హైస్ట్, అడ్వెంచర్, ట్రెజర్ హంట్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement