తమన్నా థ్రిల్లర్‌ మూవీ.. ఆసక్తిగా ట్రైలర్ | Sidharth Malhotra and Tamannaah THE VVAAN Official Trailer | Sakshi
Sakshi News home page

THE VVAAN Official Trailer: తమన్నా థ్రిల్లర్‌ మూవీ.. ఆసక్తిగా ట్రైలర్

Sep 16 2026 8:08 PM | Updated on Sep 16 2026 8:55 PM

Sidharth Malhotra and Tamannaah THE VVAAN Official Trailer

బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా వస్తోన్న లేటేస్ట్ థ్రిల్లర్ మూవీ ది వాన్. ఈ చిత్రానికి దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని బాలాజీ టెలిఫిల్మ్స్ బ్యానర్‌పై  శోభా కపూర్, ఏక్తా కపూర్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది.

ఈ నేపథ్యంలోనే ది వాన్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే గ్రామీణ నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఓ గ్రామ సమీపంలోని ఫారెస్ట్‌లో ఈ కథను రూపొందించారు. ట్రైలర్‌లో అడవిలోని సన్నివేశాలు ఈ మూవీపై ఆసక్తిని పెంచేస్తున్నాయి. ఈ చిత్రంలో సునీల్ గ్రోవర్, మనీష్ పాల్, శ్వేతా తివారీ, అనూప్ సోని కీలక పాత్రల్లో నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement