ఇటీవలే రిలీజైన రవితేజ ఇరుముడి సూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది. తండ్రి, కూతురి సెంటిమెంట్‌తో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీకి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. అలా సామ్ లీడ్ రోల్లో వచ్చిన మా ఇంటి బంగారం సైతం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. ఈ మూవీ రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి.
ఓవర్సీస్‌లో రివర్స్..
రవితేజ ఇరుముడి ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల మైలురాయి అందుకున్నప్పటీ.. సమంత మూవీ కంటే వెనకే ఉంది. ఓవర్‌సీస్ వసూళ్లపరంగా చూస్తే సమంత మా ఇంటి బంగారం ముందుంది. ఈ లిస్ట్‌లో రామ్ చరణ్ పెద్ది తొలిస్థానంలో(రూ.53 కోట్లు) ఉండగా.. రెండోస్థానంలో మనశంకరవరప్రసాద్‌గారు(రూ.43 కోట్లు).. మూడోస్థానంలో ది రాజాసాబ్(రూ.34 కోట్లు) చిత్రాలు ఉన్నాయి. ఆ తర్వాత నాలుగో స్థానంలో సమంత మా ఇంటి బంగారం(రూ.28 కోట్లు) నాలుగోస్థానంలో ఉండగా.. రవితేజ ఇరుముడి(రూ.22 కోట్లు) ఐదోస్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా చూస్తే రూ.200 కోట్లు దాటేసిన ఇరుముడి.. ఓవర్‌సీస్‌లో మాత్రం వెనకపడిపోయింది.


