ప్రముఖ నటుడు అనంత్ నాగ్‌కు 'దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు' | Veteran Actor Anant Nag Conferred with Prestigious Dadasaheb Phalke Award | Sakshi
Sakshi News home page

ప్రముఖ నటుడు అనంత్ నాగ్‌కు 'దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు'

Sep 16 2026 6:05 PM | Updated on Sep 16 2026 7:33 PM

Veteran Actor Anant Nag Conferred with Prestigious Dadasaheb Phalke Award

సాక్షి,న్యూఢిల్లీ: ప్రముఖ కన్నడ నటుడు అనంత్‌ నాగ్‌కు భారతీయ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అత్యున్నత పురస్కారం ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’ వరించింది. భారతీయ చలనచిత్ర రంగానికి ఆయన అందించిన అమూల్యమైన సేవలకు గాను కేంద్రం అనంత్ నాగ్‌ను ఎంపిక చేసింది. ఈ నెల 22న గుజరాత్‌లోని కేవడియాలో జరగనున్న 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో అనంత నాగ్‌కు ఈ అవార్డును ప్రధానం చేయనుంది 

కన్నడతో పాటు పలు భాషల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరించిన అనంత్ నాగ్‌కు ఈ పురస్కారం దక్కడం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఐదు దశాబ్దాల సినీ ప్రయాణం 
ఐదు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన సినీ ప్రయాణంలో కన్నడతో పాటు హిందీ, తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో వందలాది సినిమాల్లో నటించారు. కేవలం కమర్షియల్ చిత్రాలే కాకుండా, ఆర్ట్ సినిమాల్లోనూ ఆయన కీలక పాత్రలు పోషించారు. ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్ బెనెగల్ తెరకెక్కించిన ‘అంకుర్’ చిత్రంతో ఆర్ట్ చిత్రరంగంలోకి అడుగుపెట్టిన ఆయన బైలు దారి,నా నిన్న బిడలారే,గణేశాన మదువె, ఇటీవల వచ్చిన కేజీఎఫ్‌తో పాటు ఎన్నో అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు.

శంకర్ నాగ్ దర్శకత్వంలో వచ్చిన ప్రఖ్యాత టీవీ సిరీస్ ‘మాల్గుడి డేస్’ లో ఆయన నటన దేశవ్యాప్తంగా అప్పట్లో విశేషమైన గుర్తింపు తెచ్చిపెట్టింది. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆయనను దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మభూషణ్’తో గౌరవించింది. అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించడం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement