పెద్ద పెద్ద సినిమాలు భారీ బడ్జెట్‌తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుంటే.. చిన్న సినిమాలు మాత్రం అనూహ్య విజయాలను అందుకుంటున్నాయి. ఇటీవల ‘ఇరుముడి’ మంచి విజయాన్ని అందుకుని భారీ వసూళ్లు సాధించగా.. ఇప్పుడు మరో కన్నడ సినిమా ఇదే బాటలో దూసుకెళ్తోంది. అదే ‘ప్రేమద ఊరాలి’. ( తెలుగులో ప్రేమనే ఊరిలో) కేవలం రూ.2.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. విడుదలైన 16 రోజుల్లోనే సుమారు రూ.43.45 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ గణాంకాలు చెబుతున్నాయి. అంటే పెట్టిన పెట్టుబడికి దాదాపు 17 రెట్లకు పైగా వసూళ్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచిందనే చెప్పాలి.
మొదట్లో తక్కువ వసూళ్లు..
శ్రీరామ్ హీరోగా తపస్విని పూనచ్చ కథానాయికగా మనోజ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తొలిరోజు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. తొలి రోజు సుమారు 60 షోల ద్వారా కేవలం రూ.9 లక్షల వసూళ్లు మాత్రమే సాధించినట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో తండ్రీకొడుకుల సెంటిమెంట్‌కి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. దీంతో క్రమంగా సానుకూల స్పందన రావడంతో సినిమా వసూళ్లు పుంజుకున్నాయి. మౌత్‌టాక్ బలపడటంతో థియేటర్ల సంఖ్యను పెంచారు. దీంతో వసూళ్లు కూడా గణనీయంగా పెరిగాయి.
(ఇదీ చదవండి: అందుకే బిగ్‌బాస్‌లో షాలినిని ఉంచి నన్ను పంపించేశారు: చరణ్)
సినిమాకు ప్రేక్షకుల ఆదరణ పెరుగుతుండటంతో ప్రదర్శనల సంఖ్య కూడా భారీగా పెరిగింది. 15వ రోజు నాటికి ఈ చిత్రం 1,178 షోలలో ప్రదర్శితమైనట్లు తెలుస్తోంది. ఆ రోజు థియేటర్లలో ఆక్యుపెన్సీ సుమారు 57 శాతంగా నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రారంభంలో పరిమితమైన వసూళ్లతో మొదలైన ఈ సినిమా.. ఆ తర్వాత ప్రేక్షకుల ఆదరణతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది. మొత్తంగా భారీ బడ్జెట్, స్టార్ హీరోలు మాత్రమే విజయానికి కొలమానం కాదని ‘ప్రేమద ఒరాలి’ మరోసారి నిరూపిస్తోంది. మంచి కథ, ప్రేక్షకుల ఆదరణ, పాజిటివ్ మౌత్‌టాక్ తోడైతే చిన్న సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకోగలవని ఈ చిత్రం వసూళ్లు స్పష్టం చేస్తున్నాయి.
(ఇదీ చదవండి: మమిత పెళ్లిపై నిర్ణయం అతడిదే.. ఈమె రియాక్షన్ ఇది)
Sri Krishna Theatre Hagaribommanhalli #PremadaOoralli Yesterday Sunday Scenario overall weekend collection re sounding despite running in 2 theatre due to overcrowded from day before yesterday main theatre is ours this is not gonna stop anytime soon🏃😭🙏🧨... #PremadaOoralli 🎥 https://t.co/PXq4odcTQn
— SriVishnu Ambadi... Raya! (@Vishnu36399105) October 12, 2026


