దర్శన్‌కు వ‌రుస ఎదురుదెబ్బ‌లు | Renukaswamy murder case latest update: Another Setback to Darshan | Sakshi
Sakshi News home page

క‌న్న‌డ న‌టుడు దర్శన్‌కు ఎదురుగాలి

Sep 25 2026 4:54 PM | Updated on Sep 25 2026 5:01 PM

Renukaswamy murder case latest update: Another Setback to Darshan

బెంగ‌ళూరు: క‌న్న‌డ అగ్ర న‌టుడు ద‌ర్శ‌న్ తూగుదీప‌కు వ‌రుస ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయి. అభిమాని హ‌త్య కేసులో నిందితుడిగా ఉన్న ఆయ‌నకు చేదు అనుభ‌వాలు ఎదుర‌వుతున్నాయి. చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో రెండవ నిందితుడిగా ఉన్న దర్శన్‌ను మరిన్ని కష్టాలు చుట్టుముట్టాయి. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన 14వ నిందితుడు ప్రదూష్ ఎస్‌. రావును ఈ నెల 28 నుంచి సాక్షిగా విచారించాలని ట్రయల్‌ కోర్టు నిర్ణయించింది. దీన్ని అడ్డుకునేందుకు ద‌ర్శ‌న్ చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. ప్రదూష్‌ అప్రూవర్‌గా మారటానికీ వీల్లేదంటూ దర్శన్‌ భార్య విజ‌య‌ల‌క్ష్మి దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను రెండు రోజుల క్రితం క‌ర్ణాట‌క‌ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ట్రయల్‌ కోర్టు అయిన బెంగళూరు 59వ సెషన్స్‌ న్యాయ‌స్థానం ప్రదూష్‌ విచారణకు తాజాగా ఉత్తర్వులిచ్చింది.

ద‌ర్శ‌న్ లాయ‌ర్ల విన‌తుల‌కు నో
సాక్షిగా ప్రదూష్ విచార‌ణను అడ్డుకునేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు విఫ‌లం కావ‌డంతో సుప్రీంకోర్టుకు వెళ్లాల‌ని దర్శన్‌ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆయన త‌ర‌పు న్యాయ‌వాదులు సెషన్స్‌ కోర్టు జడ్జికి తెలిపారు. అప్ప‌టివ‌ర‌కు ప్రదూష్‌ విచారణను వాయిదా వేయాలని మనవి చేశారు. వారి విన‌తుల‌ను న్యాయ‌మూర్తి తిర‌స్క‌రించారు. ఈ నెల‌ 28 నుంచి ప్రదూష్‌ను అప్రూవర్‌గా విచారించాలని ఆదేశాలు జారీ చేశారు.  

ప్రదూష్ నోరు విప్పితే..
అప్రూవ‌ర్‌గా మారిన ప్రదూష్ ఎస్‌. రావు సాక్ష్యం ఈ కేసులో కీల‌కం కానుంది. ద‌ర్శ‌న్‌, ప‌విత్ర గౌడ‌కు వ్య‌తిరేకంగా ఆయ‌న సాక్ష్యం ఇస్తే వారికి మ‌రిన్ని ఇబ్బందులు త‌ప్ప‌వు. దీంతో అత‌డు ఏమి చెబుతాడ‌నే దానిపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. కాగా, రేణుకాస్వామి హత్య జ‌రిగిన‌ప్పుడు తాను ఘ‌ట‌నా స్థ‌లంలో ఉన్న‌ట్టు ప్రదూష్ ఇప్ప‌టికే వాంగూల్మం ఇచ్చిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

ఇదీ చ‌ద‌వండి: కులం కన్నా కారణం ముఖ్యం

చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో ప‌విత్ర గౌడ ప్ర‌ధాన నిందితురాలు కాగా, ద‌ర్శ‌న్ రెండో నిందితుడిగా ఉన్నారు. 2024, జూన్ 8న కామాక్షిపాళ్యంలో రేణుకాస్వామి హ‌త్య‌కు గుర‌య్యాడు. ప‌విత్ర గౌడ ఆదేశాల‌కు మేర‌కు ద‌ర్శ‌న్‌, అత‌డి అనుచ‌రులు.. రేణుకాస్వామిని చిత్ర‌హింస‌ల‌కు గురిచేసి దారుణంగా చంపిన‌ట్టు పోలీసులు అభియోగాలు న‌మోదు చేశారు. ప్ర‌స్తుతం నిందితులంద‌రూ బెంగ‌ళూరు జైల్లో ఉన్నారు. 

ఇదీ చ‌ద‌వండి: క‌ర్ణాట‌క కాంగ్రెస్‌లో బిగ్ ట్విస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement