పోలాండ్‌లో ఓ వ్యక్తి కత్తితో దాడి.. ఒకరి మృతి, నలుగురికి గాయాలు! | Poland Abbey Knife Attack Priest Killed | Sakshi
Sakshi News home page

పోలాండ్‌లో ఓ వ్యక్తి కత్తితో దాడి.. ఒకరి మృతి, నలుగురికి గాయాలు!

Sep 25 2026 12:39 PM | Updated on Sep 25 2026 1:11 PM

Poland Abbey Knife Attack Priest Killed

పోలాండ్‌: దేశంలోని జారోస్లావ్‌ పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ క్యాథలిక్‌ అబ్బే ప్రాంగణంలో గురువారం కత్తితో దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ పూజారి మృతి చెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో నలుగురు పురుషులు, ఓ మహిళ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్న 31 ఏళ్ల ఉక్రెయిన్‌ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలిష్‌ మీడియా కథనాల ప్రకారం.. నిందితుడు తొలుత అబ్బే సమీపంలోని ఓ కేఫ్‌కు వెళ్లాడు. అక్కడ ఓ పూజారిపై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఆ తర్వాత అబ్బేలోకి వెళ్లి మరో నలుగురిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడికి కారణమేంటన్నది ఇంకా తెలియలేదు. మృతి చెందిన పూజారి పేరును అధికారులు బయటకు చెప్పలేదు.

ఘటనపై పోలాండ్‌ అధ్యక్షుడు కరోల్‌ నవ్రోకీ స్పందించారు. ఈ దాడి అందరినీ కలచివేసిందని.. దీనిపై ప్రభుత్వం కఠినంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. నిందితుడికి దేశ చట్టాల ప్రకారం కఠిన శిక్ష పడుతుందని ప్రధాని డొనాల్డ్‌ టస్క్‌ తెలిపారు. ఈ ఘటనతో తీవ్ర ఆందోళనకు గురైన వారికి అండగా నిలిచేందుకు అవసరమైన సహాయం అందిస్తున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రి మార్సిన్‌ కియెర్విన్స్కీ తెలిపారు.

మరోవైపు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్‌స్కీ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితుడు చట్టం ప్రకారం పూర్తి బాధ్యత వహించాల్సిందేనని అన్నారు. ఘటనకు సంబంధించిన అన్ని అంశాలపై వేగంగా, సమగ్రంగా దర్యాప్తు జరపాలని ఉక్రెయిన్‌ కోరింది. రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌ నుంచి పోలాండ్‌కు వచ్చిన ప్రజలు, స్థానికుల మధ్య గతంలో కొన్ని ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: వినీత్ మనోచా హత్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement