18 ఏళ్లు నిండకముందే అంతమంది అ‍మ్మాయిలపై..: యునిసెఫ్ | UNICEF Data 1 In 8 Girls Globally Face this full details | Sakshi
Sakshi News home page

18 ఏళ్లు నిండకముందే అంతమంది అ‍మ్మాయిలపై..: యునిసెఫ్

Sep 25 2026 12:29 AM | Updated on Sep 25 2026 12:40 AM

  UNICEF Data 1 In 8 Girls Globally Face this full details

ప్రపంచవ్యాప్తంగా 18 ఏళ్లలోపు బాలికల్లో ఎనిమిది మందిలో ఒకరు అత్యాచారం లేదా లైంగిక దాడికి గురవుతున్నట్లు యునిసెఫ్ గణాంకాలు వెల్లడించాయి. ప్రస్తుతం జీవించి ఉన్న బాలికలు, మహిళల్లో 65 కోట్ల మంది బాల్యంలోనే ఏదో ఒక రూపంలో లైంగిక హింసను ఎదుర్కొన్నట్లు యునిసెఫ్ తెలిపింది. ఈ అంచనాలు 2024లో అందుబాటులో ఉన్న దేశాల వారీ సమాచారం, గణాంక సవరణల ఆధారంగా రూపొందించారు.

యునిసెఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. 37 కోట్లకు పైగా బాలికలు 18 ఏళ్లు నిండకముందే అత్యాచారం లేదా లైంగిక దాడికి గురయ్యారు. ఇందులో అత్యాచారం, లైంగిక దాడి లైంగిక హింసలో భాగమే. లైంగిక హింసలో శారీరక సంబంధం ఉన్న దాడులతో పాటు శారీరక సంబంధం లేని లైంగిక వేధింపులు కూడా ఉంటాయి. అందువల్ల 37 కోట్ల సంఖ్యను 65 కోట్లకు అదనంగా కలపకూడదని యునిసెఫ్ స్పష్టం చేసింది.

లైంగిక వేధింపుల ముప్పు ఆన్‌లైన్‌లోనూ..
ఇందులో భాగంగా 60 దేశాల సమాచారాన్ని పరిశీలించగా.. బాల్యంలో లైంగిక సంబంధిత హింసకు గురైన వయోజన మహిళల్లో 42 శాతం మందికి మొదటిసారి ఆ అనుభవం బాల్యంలోనే ఎదురైనట్లు తేలింది. ప్రాంతాల వారీగా కూడా గణాంకాల్లో తేడాలు ఉన్నాయి. ఉప సహారా ఆఫ్రికాలో 18 ఏళ్లలోపు లైంగిక హింసను ఎదుర్కొన్న బాలికలు, మహిళలు 7.9 కోట్లు ఉన్నట్లు అంచనా. తూర్పు, ఆగ్నేయ ఆసియాలో 7.5 కోట్లు, మధ్య, దక్షిణ ఆసియాలో 7.3 కోట్లు ఉన్నట్లు యునిసెఫ్ తెలిపింది. ఈ రెండు ఆసియా ప్రాంతాల్లోని సంఖ్య కలిపి ప్రపంచ మొత్తంలో 40 శాతంగా ఉంది.

లైంగిక వేధింపుల ముప్పు ఆన్‌లైన్‌లోనూ కొనసాగుతోంది. 21 దేశాల్లో నిర్వహించిన 2026 యునిసెఫ్ అధ్యయనం ప్రకారం.. 12-17 ఏళ్ల మధ్య ఇంటర్నెట్‌ ఉపయోగించే 2 కోట్ల మంది పిల్లలు ఆన్‌లైన్ లైంగిక దోపిడీ లేదా వేధింపులను ఎదుర్కొన్నారు. ఈ పరిశోధనకు 2020-21, 2024-25లో సేకరించిన సమాచారం ఉపయోగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement