రూ.200 కోట్ల సినిమా.. త్రివిక్రమ్ తప్పుకున్నారా? | latest Movie Hanuman Ansh in trouble before Telugu release | Sakshi
Sakshi News home page

Hanuman ansh Movie: రూ.200 కోట్ల సినిమా.. త్రివిక్రమ్ తప్పుకున్నారా?

Sep 16 2026 3:52 PM | Updated on Sep 16 2026 4:41 PM

latest Movie Hanuman Ansh in trouble before Telugu release

బాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన మూవీ హనుమాన్ అంశ్. ఈ మూవీ అక్కడ హిట్ కావడంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా విడుదల హక్కులను డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసుకున్నారు. అంతేకాకుండా ఈనెల 15న తెలుగు టీజర్ రిలీజ్‌ చేస్తామని ప్రకటించారు. కానీ అలాంటిదేం జరగలేదు. దీంతో సినీ ప్రియులు సందిగ్ధంలో పడిపోయారు.

ఈ మూవీ తెలుగులో రిలీజ్ ‍అవుతుందా? లేదా అనే డైలామాలో పడేశారు. తెలుగు టీజర్ లాంచ్ ఈవెంట్ వాయిదా పడటంతో సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు కొన్ని కారణాలతో త్రివిక్రమ్‌ ఈ సినిమా నుంచి వైదొలిగారని.. దీంతో సినిమా విడుదల వాయిదా పడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. విడుదల తేదీ మార్పుపై కూడా నిర్మాతల నుంచి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో సెప్టెంబర్‌ 18న తెలుగు రిలీజ్ వాయిదా పడనుందని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. కాగా.. ఈ చిత్రానికి విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించారు. ఈ మూవీ బాలీవుడ్‌లో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement