ఒక్క నిర్ణయం.. త్రివిక్రమ్ జీవితాన్నే మార్చేసింది | Trivikram Left Job As Writer And Works 3k For Krishna Vamsi | Sakshi
Sakshi News home page

Trivikram: పోసాని దగ్గర మానేసి రూ.3 వేల ఉద్యోగంలో.. తీరా చూస్తే

Sep 16 2026 1:17 PM | Updated on Sep 16 2026 1:26 PM

Trivikram Left Job As Writer And Works 3k For Krishna Vamsi

మనం జీవితంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు మన ఫేట్ డిసైడ్ చేస్తాయి. అయితే అవి ఎప్పుడు ఎలా తీసుకోవాలనేది మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అలాంటి ఓ నిర్ణయాన్ని తీసుకుని ఇప్పుడు ఇలా స్టార్ డైరెక్టర్ అయ్యాడు. ఇండస్ట్రీలో ఉన్న కొందరికే తెలిసిన త్రివిక్రమ్ సీక్రెట్‌ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలుగు సినీ రచయిత బీవీఎస్ రవి బయటపెట్టాడు. రూ.3 వేల జీతానికి పనిచేసిన త్రివిక్రమ్.. అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో వెల్లడించాడు.

(ఇదీ చదవండి: పిల్లల సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకున్న సూర్య-జ్యోతిక)

90ల్లో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత త్రివిక్రమ్.. పోసాని దగ్గర రచయితగా పనిచేసేవాడు. అ‍ప్పట్లోనే త్రివిక్రమ్‌కి రూ.40 వేల జీతం ఇచ్చేవారు. తిరిగేందుకు కారు, స్టోరీ డిస్కషన్ కోసం లగ్జరీ హోటల్స్‌లో రూమ్స్ ఇలా ఓ రేంజులో జీవితం ఉండేది. కానీ దర్శకుడు కావాలనే ఆశతో ఈ ఉద్యోగం మానేశాడు. కృష్ణవంశీ దగ్గర సహాయ దర్శకుడిగా రూ.3 వేల జీతానికి చేరాడు. ఇది చూసిన బీవీఎస్ రవి.. త్రివిక్రమ్‌ని ఇదే విషయం అడగ్గా.. నేను డైరెక్టర్ అవ్వడానికి వచ్చా, పోసానికి అసిస్టెంట్‌గా అవ్వడానికి కాదని తనతో అన్నట్లు బీవీఎస్ రవి చెప్పుకొచ్చాడు. అప్పుడు కలగన్నాడు కాబట్టి ఇప్పుడు స్టార్ డైరెక్టర్ అయ్యాడని త్రివిక్రమ్ తీసుకున్న లైఫ్ మారిపోయే నిర్ణయం గురించి బయటపెట్టాడు.

త్రివిక్రమ్.. 'సముద్రం' కోసం కృష్ణవంశీ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశాడు. ఇతడితో పాటు నందినిరెడ్డి, శ్రీవాస్ కూడా అసిస్టెంట్ డైరెక్టర్స్‌గా  చేశారు. తర్వాత కాలంలో వీళ్లంతా డైరెక్టర్స్ అయ్యారు. కానీ రచయితగా త్రివిక్రమ్ ఎంత పేరు తెచ్చుకున్నాడో.. దర్శకుడిగా అంతకు మించిన స్టార్‌డమ్ సొంతం చేసుకున్నాడు.

నువ్వు నాకు నచ్చావ్, మళ్లీశ్వరి లాంటి సినిమాలతో రైటర్‌గా హిట్ కొట్టిన త్రివిక్రమ్.. నువ్వే నువ్వే, అతడు, జల్సా, జులాయి, అత్తారింటికి దారేది, అఆ, సన్నాఫ్ సత్యమూర్తి, అరవింద సమేత,‍ అల వైకుంఠపురములో సినిమాలతో అద్భుతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం వెంకటేశ్‌తో 'ఆదర్శ కుటుంబం' తీస్తున్న గురూజీ.. త్వరలో ఎన్టీఆర్ హీరోగా కుమారస్వామి నేపథ్య కథతో భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు.

(ఇదీ చదవండి: రూ.50 కోట్ల ఖరీదైన నగలు కొట్టేస్తే.. రూ.110 మాత్రమే పరిహారం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement