తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్‌గా చేసి ఆపై డ్యాన్స్ రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించిన నటి పూర్ణ.. కేరళకు చెందిన ఈమె దుబాయికి చెందిన బిజినెస్‌మ్యాన్ షనీద్ అసిఫ్ అలీని కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. చివరగా గతేడాది డిసెంబరులో రిలీజైన 'అఖండ 2' మూవీలో కనిపించింది. 'జైలర్ 2'లోనూ స్పెషల్ సాంగ్ చేసింది.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: ఓరి నాయనో ఇదేం 'ప్రేమ'? చైత్ర-చరణ్.. అనుకున్నట్లే ట్విస్ట్)
ఇలా సినిమాలతో ఓవైపు బిజీగా ఉంటూనే మరోవైపు దుబాయిలో ఓ డ్యాన్స్ స్టూడియోని కూడా పూర్ణ నడుపుతోంది. ఇందులో చాలామంది పిల్లలకు డ్యాన్స్ ట్రైనింగ్ ఇస్తోంది. అయితే తన స్టూడియోలో డ్యాన్స్ నేర్చుకునే ఓ పాప చనిపోయిన విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న పూర్ణ.. చాలా విచారం వ్యక్తం చేసింది.
'కొన్ని వీడ్కోలు మాటలకు అందవు. ఎంతలా కన్నీళ్లు పెట్టుకున్నా గుండెల్లోని బాధ తొలగిపోదు. చిన్నారి అమాయకమైన చిరునవ్వు, డాన్స్ నేర్చుకునే సమయంలో వేసిన చిన్ని చిన్ని అడుగులు స్టూడియోలోని ప్రతి మూలలో ఎప్పటికీ జ్ఞాపకాలుగా నిలిచిపోతాయ్. ఈమె నా స్టూడెంట్ మాత్రమే కాదు. నా కుటుంబంలో ఒకరిగా భావించా. డాన్స్ స్టూడియో ఉన్నంతకాలం ఈ చిన్నారి మా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, నీకు కన్నీటి నివాళి అర్పిస్తున్నాం' అని నటి పూర్ణ పోస్ట్ పెట్టింది.
(ఇదీ చదవండి: నా రెండో బిడ్డ కళ్లలో ఆయనని చూసుకుంటున్నా: నటి పూర్ణ)


