ఈసారి బిగ్‌బాస్ షోలో తొలివారమే ఇద్దరూ ఎలిమినేట్ అయిపోయారు. అది కూడా వారం మధ్యలోనే హౌస్ నుంచి వెళ్లిపోవడంతో అంతా షాకయ్యారు. కానీ వాళ్లిద్దరూ బయటకెళ్లలేదు. అనుకున్నట్లే ఈ విషయంలో ట్విస్ట్ ఇచ్చారు. అలానే దేబ్జానీ, ముకేశ్ అయితే నిజమైన ప్రేమికుల కంటే అతి చేస్తున్నారు. ఇంతకీ బిగ్‌బాస్ 10లో 10వ రోజైన మంగళవారం ఏం జరిగింది? ఎపిసోడ్ హైలైట్స్ ఏంటి?
(ఇదీ చదవండి: పిల్లల సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకున్న సూర్య-జ్యోతిక)

నామినేషన్ల హంగామాతో సోమవారం ఎపిసోడ్ ముగిసింది. దీని గురించి మాట్లాడుకోవడంతో మంగళవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. ఇంతలో ముకేశ్, వర్షిణితో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో దిగాడు. దీంతో దేబ్జానీ సరదాగానే ముకేశ్‌తో గొడవ పెట్టుకుంది. నా చెల్లికి అన్యాయం చేస్తావా అని రాంప్రసాద్ ఓవైపు నుంచి ముకేశ్‌ని అడుగుతుంటే.. నేను ఉండగా మరొకరితో పూల్‌లోకి ఎలా దిగుతావ్ అని దేబ్జానీ అడిగింది. ఇదంతా చూసిన ప్రేక్షకులు ఓరి నాయనో ఇదేం ప్రేమ అనకుండా ఉండలేరు.
ఇక వినాయక చవితి పండగని ఇంట్లోనే అంతా కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన పూజా సామాగ్రిని బిగ్‌బాస్ పంపించాడు. కాసేపటి తర్వాత కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. పవర్ ఆఫ్ పీపుల్‌లో ఉన్న త్రిగుణ్, దేబ్‌జానీ, అమన్, షాలిని, ముఖేశ్, రోహిత్, ఝాన్సీ, రాంప్రసాద్‌లు కెప్టెన్ అయ్యేందుకు పోటీపడ్డారు. బెలూన్ టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్స్ అందరికీ కొన్ని స్పెల్లింగ్స్ ఇచ్చారు. ఎవరు కరెక్ట్‌గా రాస్తే వాళ్లు మిగతా కంటెస్టెంట్స్‌లలో ఒకరి బెలూన్ పగలగొట్టి కారణాలు చెప్పాలని బిగ్‌బాస్ అన్నాడు.
మొదటి రౌండ్‌లో త్రిగుణ్ బెలూన్లు నాలుగూ వేరే మిగతావాళ్లు పగలగొట్టేయడంతో ఇతడు ఎలిమినేట్ అయ్యాడు. తర్వాత వరసగా రోహిత్, రాంప్రసాద్, దేబ్జానీ, షాలినీ, ముకేశ్ ఎలిమినేట్ అయ్యారు. చివరగా మిగిలిన ఝాన్సీ, అమన్‌లకు బుధవారం నాడు కెప్టెన్సీ పోటీ ఉండబోతుంది. గతవారం ఎలిమినేట్ అయిన చైత్ర, చరణ్ విషయంలో అనుకున్నట్లే బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. వీళ్లిద్దరిలో ఒకరిని తిరిగి హౌస్‌లోకి తీసుకొచ్చే బాధ్యత ఆడియెన్స్‌కి ఇచ్చారు. ప్రేక్షకులు ఎవరికి ఎక్కువ ఓట్లు వేస్తారో వాళ్లు రీఎంట్రీ ఇస్తారు. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)


