ఓటీటీలోకి తమిళ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్ | Tamil Comedy Hit Modha Rathiri Movie OTT Release Date Confirmed, Check Out Streaming Platform Details | Sakshi
Sakshi News home page

Modha Rathiri OTT: ఫస్ట్ నైట్ రోజు జరిగే కామెడీ మూవీ.. ఓటీటీలో ఎప్పుడంటే?

Sep 16 2026 9:20 AM | Updated on Sep 16 2026 10:10 AM

Modha Rathiri Movie OTT Release Date And Details

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తుంటాయి. అలా ఈ వారం కూడా దాదాపు 24 వరకు మూవీస్, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో ఇరుముడి, హుషార్ పిట్టలు, తుడక్కం, లస్ట్ స్టోరీస్ 3, రామ్ అండ్ లీలా తదితర చిత్రాలు ఉన్నాయి. వీటితోపాటు ఇప్పుడు రీసెంట్‌గా హిట్ అయిన తమిళ కామెడీ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.

(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ సినిమా)

సిరాయ్, యూత్ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనిష్మా హీరోయిన్‌గా చేసిన లేటెస్ట్ తమిళ సినిమా 'మొదరాత్రి'. తెలుగులో ఈ టైటిల్‌కి ఫస్ట్ నైట్ అని అర్థం. టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని నిర్మించింది. గత నెల 21న థియేటర్లలోకి వచ్చి హిట్ అయింది. ఇప్పుడు ఈ శుక్రవారం (సెప్టెంబరు 18) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు.

'మొదరాత్రి' విషయానికొస్తే.. పెళ్లయిన రోజు రాత్రే తాను మరో వ్యక్తిని ప్రేమిస్తున్నానని ముత్తు సెల్వి(అనిష్మా), భర్త మారుదు(రిషికాంత్)కు చెబుతుంది. కానీ మారుదు కోప్పడడు. ప్రేమించిన వ్యక్తితో తన భార్యని కలపాలని అనుకుంటాడు. ఈ మేరకు ఆమెకు సాయం కూడా చేయాలనుకుంటాడు. అలా ఆరోజు రాత్రి వీళ్లిద్దరూ ముత్తుసెల్వి ప్రియుడితో కలిసి బయటకు వెళ్తారు. తర్వాత ఏమైంది? అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: పిల్లల సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకున్న సూర్య-జ్యోతిక)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement