సూపర్‌ షీ ఛాలెంజ్‌ | Killer Movie Pre Release Event | Sakshi
Sakshi News home page

సూపర్‌ షీ ఛాలెంజ్‌

Sep 16 2026 12:21 AM | Updated on Sep 16 2026 12:21 AM

Killer Movie Pre Release Event

పూర్వాజ్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కిల్లర్‌’. జ్యోతి పూర్వాజ్‌ హీరోయిన్‌గా నటించారు. మనీష్‌ గిలాడా, చంద్రకాంత్‌ కొల్లు, విశాల్‌ రాజ్, అర్చన అనంత్, గౌతమ్‌ చక్రధర్‌ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటించారు. ఉర్వీశ్‌ పూర్వాజ్‌ సమర్పణలో ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్‌ సినిమా, ఏయూ అండ్‌ ఐ స్టూడియోస్‌ బ్యానర్స్‌పై పూర్వాజ్, పద్మనాభరెడ్డి .ఎ  నిర్మించారు. 

ఈ సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఓఎంజి పిక్చర్స్‌ ఈ సినిమాను ఓవర్సీస్‌లో డ్రిస్టిబ్యూట్‌ చేస్తోంది. అమెరికా, యూరప్, కెనడా, అరబ్‌ దేశాలు, మలేషియా, న్యూజిలాండ్, రష్యా వంటి దేశాల్లో ఈ సంస్థ రిలీజ్‌ చేయబోతోంది. కాగా మహిళల కోసం ‘సూపర్‌ షీ ఛాలెంజ్‌’ను అనౌన్స్‌ చేశారు ‘కిల్లర్‌’ మేకర్స్‌. ‘‘రాత్రికి రాత్రే మీకు సూపర్‌ పవర్‌ వస్తే ఏం చేస్తారో చెబుతూ రీల్స్‌ చేసి పంపించాలి. బెస్ట్‌ రీల్స్‌ చేసిన పది మందికి ఒక్కొక్కరికి పది వేల రూపాయల చొప్పున క్యాష్‌ ప్రైజ్‌ ఇవ్వబోతున్నాం. 

అలాగే ఆన్సర్స్‌ను టెక్ట్స్‌ మెసేజ్‌ పంపిన వారిలో బెస్ట్‌ ఆన్సర్స్‌ పంపిన 20 మందికి రెండు వేల రూపాయల చొప్పున క్యాష్‌ ప్రైజ్‌ ఇస్తాం. త్వరలో జరగనున్న ‘కిల్లర్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో విజేతలను వేదిక మీదకు పిలిచి ఈ క్యాష్‌ ప్రైజ్‌ అందిస్తాం. ఔత్సాహికులు తమ రీల్స్, టెక్ట్స్‌ మెసేజ్‌లు జ్యోతి పూర్వాజ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌కు ట్యాగ్‌ చేసి పంపించాలి’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: జగదీశ్‌ బొమ్మిశెట్టి, సంగీతం: ఆశీర్వాద్, సుమన్‌ జీవ, లైన్‌ ప్రొడ్యూసర్స్‌: దశరథ మాధవ్, సీతారామారావు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: డీఎస్‌ బాష.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement