కంగనా రనౌత్‌ vs రాఖీ సావంత్‌ | Kangana Ranaut Takes on Rakhi Sawant | Sakshi
Sakshi News home page

కంగనా రనౌత్‌ vs రాఖీ సావంత్‌

Sep 16 2026 12:16 AM | Updated on Sep 16 2026 12:16 AM

Kangana Ranaut Takes on Rakhi Sawant

బాలీవుడ్‌ హీరోయిన్లు కంగనా రనౌత్‌–రాఖీ సావంత్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మాటల యుద్ధం జరుగుతోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన జెన్‌ జీ విద్యార్థుల నిరసనలు, యూత్‌ వ్యవహారశైలిపై బీజేపీ ఎంపీ, హీరోయిన్‌ కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీనిపై రాఖీ సావంత్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా కంగనాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఓ వీడియోను షేర్‌ చేశారు. అదే విధంగా గతంలో కంగనా రనౌత్‌ ఎదుర్కొన్న పలు వివాదాలను కూడా ప్రస్తావిస్తూ రాఖీ తనదైన స్టైల్‌లో మండిపడ్డారు. 

యూట్యూబర్‌ సమయ్‌ రైనా నిర్వహించిన ‘ఇండియాస్‌ గాట్‌ లేటెంట్‌’ కార్యక్రమంలో పాల్గొన్న రాఖీ సావంత్‌... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఎంపీ కంగనా రనౌత్‌పై చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీనిపై కంగనా రనౌత్‌ ఇటీవల స్పందించి, ‘‘విజయవంతమైన మహిళలను టార్గెట్‌ చేయడం వెనుక అసూయ, అహం, వ్యక్తిగత వైఫల్యాలు ఉండొచ్చు. 

తరచుగా నాపై జరిగే వ్యక్తిగత విమర్శలకు ప్రతిసారీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి రాఖీ సావంత్‌ లక్ష్యంగా కంగనా చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు మరింత వైరల్‌ అవుతున్నాయి. ‘‘స్వీపర్‌ ఉద్యోగం చేయడానికి కూడా ప్రతిభ ఉండాలి. నీకు అది కూడా రాదు. నా రీల్స్‌ చూస్తూ ఏడవడం తప్ప నువ్వు ఏమీ చేయలేవు’’ అంటూ కంగనా రనౌత్‌ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. అయితే పై విషయాల్లో కొందరు నెటిజన్లు కంగనాకు సపోర్ట్‌ చేస్తుంటే... మరికొందరు రాఖీకి మద్దతుగా నిలుస్తున్నారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement