'ది ప్యారడైజ్' టికెట్ రేట్లు పెంచుతారా?.. ఎందుకీ రిస్క్? | The Paradise Movie: Ticket rates hike for Nani paradise is it a wise decision | Sakshi
Sakshi News home page

'ఇరుముడి' దారిలో కాకుండా.. 'ది ప్యారడైజ్' టికెట్ రేట్లు పెంచుతారా?.. ఎందుకీ రిస్క్?

Sep 15 2026 11:06 PM | Updated on Sep 15 2026 11:10 PM

The Paradise Movie: Ticket rates hike for Nani paradise is it a wise decision

ఇటీవల సాధారణ టికెట్ రేట్లతోనే పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధిస్తున్నాయి. ముఖ్యంగా ‘ఇరుముడి’ రెగ్యులర్ ధరలతోనే డబుల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మరోవైపు టికెట్ రేట్ల పెంపుతో వచ్చిన ‘టాక్సిక్’ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ఇలాంటి సమయంలో నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమా టికెట్ రేట్ల పెంపుతో వస్తుందనే ప్రచారం మొదలైంది. ఈ చిత్రం ప్రీమియర్స్‌కు ఫ్లాట్‌గా రూ.400 ధర నిర్ణయించినట్లు, తొలి రోజు నుంచి పది రోజుల వరకు ఏపీ, తెలంగాణలో టికెట్ ధరలు పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక జీవోలు రావాల్సి ఉంది.

అయితే అసలు ప్రశ్న టికెట్ రేట్లు ఎంత పెంచుతున్నారనేది కాదు.. ఎందుకు పెంచుతున్నారనేదే. కంటెంట్‌పై నమ్మకం ఉంటే సాధారణ ధరలతోనే సినిమా విడుదల చేసి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించవచ్చని ‘ఇరుముడి’ వంటి సినిమాలు నిరూపించాయి.

‘ది ప్యారడైజ్’ మేకర్స్.. ఇప్పటికే ఈ సినిమాను ట్రైలర్ లేకుండా రిలీజ్ చేస్తూ ఓ రిస్క్ తీసుకుంటున్నారు. ఇప్పుడు టికెట్ రేట్ల పెంపుతో మరో రిస్క్ చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయం సినిమాకు ప్లస్ అవుతుందా.. లేక ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత వస్తుందా అనేది రిలీజ్ తర్వాతే తేలనుంది.

తాజాగా నాని సినీ ప్రయాణం 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ మూవీకి సంబంధించి బిగ్‌ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్‌ తేదీపై ఎలాంటి సందేహలు అక్కర్లేదని స్పష్టం చేశారు. ముందుగా ప్రకటించిన సెప్టెంబర్ 24 తేదీనే థియేటర్లలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి సెప్టెంబరు 24న రిలీజ్‌ డేట్‌తో కూడిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు, ఇతర భాషల్లోనూ విడుదల చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement