సందీప్ కిషన్ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించిన చిత్రం ‘సిగ్మా’. జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అంబు దాసన్, యోగ్ జాపీ కీలక పాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్స్ పై సుభాస్కరన్ నిర్మించిన ఈ మూవీ తమిళ, తెలుగు భాషల్లో అక్టోబరు 2న విడుదల కానుంది. ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ ఈ చిత్రాన్ని కోస్తాంధ్ర, తెలంగాణలో విడుదల చేయనుండగా, ఎన్ వీఆర్ సినిమా సీడెడ్‌లో రిలీజ్ చేస్తోంది.
ఈ విషయాన్ని మంగళవారం అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ‘‘యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందిన చిత్రం ‘సిగ్మా’. ఇప్పటికే డిఫరెంట్ ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై ఆసక్తి పెరిగింది. టీజర్, సాంగ్స్ కూడా మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. లైకా ప్రొడక్షన్స్ , మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ కలిసి రావడం ఈ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది. ఇక ఎన్ వీఆర్ సినిమా అసోసియేషన్ కూడా మరో ప్లస్‌గా నిలవనుంది. గాంధీ జయంతి హాలిడేకు తోడు వీకెండ్ కూడా కలసి రావడంతో సినిమాకు మంచి అడ్వాంటేజ్ అవుతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.


