బాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన మూవీ హనుమాన్ అంశ్. ఈ మూవీ అక్కడ హిట్ కావడంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా విడుదల హక్కులను డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసుకున్నారు. అంతేకాకుండా ఈనెల 15న తెలుగు టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ అలాంటిదేం జరగలేదు. దీంతో సినీ ప్రియుల్లో ఈ మూవీ రిలీజ్‌పై సందిగ్ధత నెలకొంది.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్ వచ్చింది. తెలుగు రిలీజ్ ఈ నెల 18న కావడం లేదని ప్రముఖ ఓవర్‌సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ ప్రకటించింది. అందుకు గల కారణాన్ని సైతం వెల్లడించింది. తెలుగు వర్షన్ డబ్బింగ్ పనులు పూర్తి కాలేదని తెలిపింది. అందువల్లే హనుమాన్ అంశ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. త్వరలోనే కొత్త రిలీజ్ తేదీని ప్రకటిస్తామని పేర్కొంది.
కాగా.. త్రివిక్రమ్ తెలుగులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఈ డీల్ నుంచి తప్పుకోవడం వల్లే విడుదల ఆగిపోయిందని వార్తలొచ్చాయి. కానీ తాజాగా డబ్బింగ్ పనుల వల్లే రిలీజ్ కావడం లేదని ప్రకటించారు. దీంతో తెలుగు రిలీజ్‌పై ఉన్న సస్పెన్స్‌కు తెరపడింది. ఈ చిత్రానికి విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించారు. ఈ మూవీ బాలీవుడ్‌లో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
HANUMAN ANSH TELUGU Version Postponed Due To A Delay In Dubbing Works. A New Release Date Will Be Announced Soon.#HanumanAnsh North America By @PrathyangiraUS@Swambhumedia @filmervishal #ShobhinawSatyaa #VihaanShedge @chandananand #PurnimaTiwari @AKRastogi #GulshanPandey… pic.twitter.com/jESSRArxtP
— Prathyangira Cinemas (@PrathyangiraUS) September 16, 2026


