breaking news
sanchari
-
'ఓ సంచారి అంతరంగం'..మనసును కదిలించే పుస్తకం!
విపులాచపృథ్వీ అన్నట్టు తెలుసుకోవడానికి బయలుదేరితే భూమి చాలా పెద్దది. కంటికి నిత్యం కనపడే మానవుడు అంతకంటే లోతు . నా బాల్యంలో మా గ్రామంలో ప్రతి ఉదయాన్నే ఇళ్ల ముందుకు "అమ్మా రాత్రి అన్నం, కూరలు మిగిలి ఉంటే. ఇయ్యండమ్మా" అని సాధారణంగా నిత్యం వినపడే కేక వెనుక ఎంత ఆకలి పేగుల ఏడుపు ఉందో, అన్నపు మెతుకు ఎంత బరువైనదో తెలుసుకునే శక్తి అప్పుడు లేదు. సాహిత్యం ఎందుకు అంటే ఇందుకే అంటాను. సాహిత్యం చెవులకు కొత్తగా వినడాన్నీ, కళ్ళకు కొత్తగా చూడటాన్నీ, మనసుకు కొత్తగా అందటాన్ని సాధన చేయిస్తుంది.సాధన జీవితానికి ప్రాణవాయువు, సాధన జీవితపు ఆ దరికి చేరడానికి సులువు కానించే తెడ్డు. మా ఊళ్ళో మేము సంచార జాతి వారిని, వారి పిల్లా పీచు, గొడ్డు మేకలు సమస్తాన్ని రోజూ చూస్త్తోనే ఉండేవాళ్ళం. మా ఇంటి ముందే డేరాలు వేసుకుని ఉండేవాళ్ళు, ఆ డేరాలు ముందే వాళ్ళ ఉడుములు కట్టేసి ఉండేవి. నేను ఆ ఉడుముల్లో ఒకదానిని ఎలాగైనా తెచ్చుకుని దాని తోకకు తాడుకట్టి ఏ కోటయినా సరే దానిని ఎక్కి ఆక్రమించుకుందామా అని చూసేవాడిని తప్పా ఆ డేరాల లోపల బీద మనుషుల బ్రతుకులు ఏమా అని తొంగి చూడాలనుకున్న వాడిని కాను.ఇంట్లో పెద్దలు కూడా వారేమిటో, వారి బ్రతుకులు ఏమిటో, బ్రతుకు దారి ఎంత పొడవో, లోతో కొలత పాఠం చెప్పిన పాపానికి పోలేదు. ఈ జాతుల పిల్లలు జన్మజన్మల దారిద్య్రం, ఆకలితో క్యాట్ బెల్ చేతపట్టి కాకుల్ని కొట్టేవాళ్ళు. ఆ కాకుల్ని వాళ్ళు తింటారని తెలిసినపుడు అసహ్యం వేసింది. కాకుల్నే కాదు అవసరం, ఆకలి అయినపుడు మనిషి మనిషిని కూడా పీక్కు తింటాడని సాహిత్యమే చెప్పింది, ఒక మనిషి తన పొట్ట ఆకలిని తీర్చడానికి స్వయాన తన కాలిని తిన్న సంగతి కూడా సాహిత్యమే నేర్పింది. నా చిన్న తనంలో చిన్న మా ఊరులో రోజూ కనపడుతూ ఉండే ఈ సంచార మనుషులు ఉన్నట్టుండి, ఊర్లు బలిసి, పసిరిక పాము వంటి మెలిక దారులు అజగరల్లా వైశ్యాల్యమయి పోయి ,ప్రపంచం పెద్దదై పోయి వీరెక్కడ కానరాకుండా పోయిన కాలంలో ఒక టీచరమ్మ పూదోట శౌరీలు నాకు " ఒక సంచారి అంతరంగం" అనే ఈ పుస్తకాన్ని కానుక చేసారు.ఈ రచనను చాలా కాలం క్రితం "అమ్మ నుడి " పత్రికలో ధారావాహిక గా చూసేవాడిని. చదవలేదు. 2017 లో అచ్చు పుస్తకంగా వచ్చిన ఈ రోజు చదివే అవకాశం కలిగింది. శ్రీ రంగనాధ రామచంద్రరావు గారి అనువాదం బావుంది. మూల రచయిత కుప్పే నాగరాజుగారు తన చేయి పట్టుకుని పాఠకుడిని 192 పేజీల సంచారం చేయించారు. ఈ పుస్తకంలో కనపడే మనుష్యులకు,తాము కనపడకుండా పుస్తకం రావడానికి దోహదం చేసిన మహా మానవులందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.పుస్తకం వెల: రూ. 200/-ప్రతులకు: అన్ని ముఖ్యమైన పుస్తక కేంద్రాలు, 1-2-740, హనుమాన్ మందిరం దగ్గర, రాకాసిపేట, బోధన్-503 185 నిజామాబాద్ జిల్లా, తెలంగాణ. --అన్వర్, సాక్షి (చదవండి: సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!) -
ముగిసిన కన్నడ నటుడి అంత్యక్రియలు
యశవంతపుర: బైక్ ప్రమాదంలో కన్నుమూసిన వర్ధమాన నటుడు సంచారి విజయ్ (38) అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం స్వస్థలం చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా పంచనహళ్లిలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. ఆయన భౌతికకాయాన్ని ప్రజల దర్శనార్థం బెంగళూరు రవీంద్ర కళాక్షేత్రంలో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ఉంచారు. కన్నడ సినీ ప్రముఖులు అనేకమంది శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో స్వస్థలానికి తీసుకెళ్లారు. అవయవాల దానం సోమవారం బ్రెయిన్‌డెడ్ అయిన విజయ్ అవయవాలను కుటుంబసభ్యులు దానం చేశారు. రెండు మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయం, గుండె, 21 హృదయ సంబంధమైన భాగాలను వైద్యులు సేకరించారు. మంగళవారం తెల్లవారుజామున ఆయన చనిపోగా సాయంత్రం 6:50 గంటలకు పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు శవాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. స్నేహితుని తోటలో ఖననం చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న విజయ్ తన స్నేహితుడు రఘుతో కలిసి పంచనహళ్లిలో పెరిగారు. విజయ్ విగతజీవిగా గ్రామంలోకి చేరుకోగానే బరువెక్కిన హృదయాలతో గ్రామస్థులు, అభిమానులు తరలివచ్చారు. కడసారి చూసుకుని అశ్రుతాంజలి అర్పించారు. అనంతరం స్నేహితుడు రఘు తోటలో వీరశైవ లింగాయత సంప్రదాయం ప్రకారం భౌతికకాయాన్ని ఖననం చేశారు. పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి తుటాలను పేల్చి గౌరవ వందనం గావించారు. అమెరికా రాయబార కార్యాలయం కన్నడంలో సంతాప సందేశాన్ని పంపించింది. చదవండి: నటుడు దుర్మరణం: స్నేహితుడిపై కేసు రోడ్డు ప్రమాదం: నటుడు సంచారి విజయ్ బ్రెయిన్ డెడ్ -
యువ శక్తి
రాజ్ విరాట్, ప్రాచీ జంటగా జె.మోహన్ కాంత్ దర్శకత్వంలో జి .కె.ఆర్ నిర్మిస్తోన్న చిత్రం ‘సంచారి’. ప్రస్తుతం మణికొండ, నార్సింగ్ పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘దేశ భవిష్యత్తును మార్చే శక్తి నేటి యువతకు ఉంది. అటువంటి యువత ప్రస్తుతం చెడు మార్గంలో పయణిస్తోంది. దానికి కారణం ఏంటి? చెడును ఎలా అంతం చెయ్యాలి? అని సందేశాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. లవ్, యాక్షన్, వినోదం›– ఇలా వాణిజ్య అంశాలుంటాయి’’ అన్నారు. ‘‘ఈ చిత్రం మంచి పేరు తీసు కొస్తుం దనే నమ్మకం ఉంది. అన్ని కార్య క్రమాలు పూర్తి చేసి, జూన్‌లో రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సాయినాథ్ గౌడ్.