అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సర్‌ప్రైజ్ వచ్చేసింది. రా కార్తీక్ దర్శకత్వంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున వందో మూవీని ‘కింగ్100’గా ఖరారు చేశారు. నేడు నాగార్జున పుట్టినరోజు(ఆగస్టు 29) సందర్భంగా ఈ చిత్రం నుంచి గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. నాగార్జున కొత్తగా కనిపిస్తున్నాడు. ‘మనుషుల్లో రెండు రకాలు..ఒకటి డబ్బు ఉన్నోల్లు, రెండు డబ్బు లేనోల్లు’ అనే డైలగ్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.
ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 24న విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఆకట్టుకుటుంది. కాగా నాగార్జున వందో చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో టబు కీలకపాత్రలో కనిపించనున్నారు.


