ఆమె అస్తమించీ.. ప్రాణం పోసింది | BrainDead Woman Organ Donation In Bengaluru | Sakshi
Sakshi News home page

ఆమె అస్తమించీ.. ప్రాణం పోసింది

Sep 27 2026 8:45 AM | Updated on Sep 27 2026 8:45 AM

BrainDead Woman Organ Donation In Bengaluru

బెంగళూరు: బ్రెయిన్‌డెడ్‌ అయిన మహిళ అవయవదానం చేయడానికి కుటుంబ సభ్యులు అంగీకరించడం ద్వారా 7 మందికి నూతన జీవితాన్ని ప్రసాదించారు. ఈ సంఘటన ఆనేకల్‌ తాలూకా ద్యావసంద్రలో జరిగింది. వివరాలు.. గ్రామ నివాసి కుసుమ (39) ప్రైవేటు కంపెనీలో పని చేస్తుండేది. భర్త జయశంకర్, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబం అంతా ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో ఇంట్లో కుసుమ హఠాత్తుగా కుప్పకూలిపోయింది. 

వెంటనే ఆమెను బొమ్మసంద్రలోని నారాయణ హెల్త్‌ సిటీ ఆస్పత్రికి తరలించగా వైద్యులు బ్రెయిన్‌డెడ్‌ అయ్యిందని చెప్పారు. ఇక ఆమె జీవించే మార్గం లేదని తెలిపారు. వైద్యుల సలహా మేరకు కుటుంబ సభ్యులు అవయవదానం చేయడానికి నిర్ణయించారు. కుసుమ కళ్లు, గుండె, లివర్, కిడ్నీ తదితర అవయవాలను సేకరించి, వివిధ జబ్బులతో బాధపడుతున్న 7 లేదా 8 మందికి అమర్చి ఆరోగ్యకర జీవితాన్నిచ్చారు. కుసుమ కుటుంబసభ్యుల త్యాగాన్ని అందరూ అభినందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement