యశవంతపుర: బెంగళూరు ఆర్‌ఆర్‌నగర బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న బహిరంగ స్థలంలో మూత్ర విసర్జన చేస్తుండగా ప్రశ్నించిన వ్యక్తిపై దౌర్జన్యం చేసినట్లు అరోపణలు వస్తున్నాయి. బెంగళూరు సదాశివనగరలోని ఖాళీ స్థలంలో మూత్ర విసర్జన చేస్తుండగా అక్కడికి వెళ్లి ఓ యువకుడు ప్రశ్నించారు. యువకుడిని ఎమ్మెల్యే నోటికొచ్చినట్లు తిట్టారు.
తన తల్లిని అవమానించేలా ఎలా మాట్లాడతావంటూ ఎమ్మెల్యేని నిలదీశారు. తిరగబడిన యువకుడిని కాలర్ పట్టుకుని ఎమ్మెల్యే బెదిరించినట్లు అరోపణలు వస్తున్నాయి. యువకుడు ఎమ్మెల్యేతో వాదులాడుతున్న సమయంలో అక్కడే ముగ్గురు పోలీసులు చూస్తూ ప్రేక్షకపాత్ర వహించిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.


