కర్ణాటక: వంటనూనె ధరలు బాగా మండిపోతున్నాయి. ఇలాంటి వేళ రోడ్డుపై ఫ్రీగా నూనె ప్యాకెట్లు దొరికితే అంతకంటే ఆనందం ఏముంటుంది?, నూనె ప్యాకెట్ల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తాపడగా ప్యాకెట్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. రోడ్డు మీద వెళ్తున్న వాహనదారులు ఇదే చాన్సంటూ ఎగబడి ఎత్తుకుపోయారు. ఈ ఘటన బెంగళూరు–మైసూరు ఎక్స్‌ప్రెస్ వేలో శుక్రవారం జరిగింది. లారీ అదుపుతప్పి పక్కకు పడిపోగా నూనె ప్యాకెట్లు విసిరేయబడ్డాయి.
కార్లలో వెళ్తున్న వారు కూడా ఆపి దొరికినన్ని ప్యాకెట్లను డిక్కీల్లో నింపుకున్నారు. ఎక్స్‌ప్రెస్ వేలో బైక్‌లు, ఆటోలకు ప్రవేశం ఉండదు, దీంతో కార్లలో వెళ్తున్నవారు పండగ చేసుకున్నారు. బస్సుల్లో వెళ్తూ ఈ దృశ్యాలను చూసిన మహిళా ప్రయాణీకులు అన్నా బస్సు ఆపండన్నా అని డ్రైవర్లను వేడుకోవడం వీడియోలలో కనిపించింది. ఖరీదైన కార్లలో వెళ్లే వారు కూడా ఉచిత నూనె కోసం తంటాలు పడ్డార


