నేను మంచివాళ్లకే మంచివాడిని, నాలోని రాక్షసుడు బయటకు వస్తే..! | Bigg Boss Demon Pavan Warning to Haters | Sakshi
Sakshi News home page

తండ్రిని కోల్పోయిన బాధే లేదే! కౌంటర్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌ పవన్‌

Apr 6 2026 9:01 AM | Updated on Apr 6 2026 9:15 AM

Bigg Boss Demon Pavan Warning to Haters

డిమాన్‌ పవన్‌.. బిగ్‌బాస్‌ షోలో ఆటతో, మాట తీరుతో ఆకట్టుకున్నాడు. రీతూతో లవ్‌ ట్రాక్‌ ఒక్కటే అతడికి మైనస్‌ అయింది తప్ప టాస్కుల్లో విశ్వరూపం చూపించేవాడు. కానీ, ఎంత చేసినా అండర్‌రేటెడ్‌ కంటెస్టెంట్‌గానే మిగిలిపోయాడు. తన తండ్రికి క్యాన్సర్‌ ఉన్నప్పటికీ ఎప్పుడూ దాని గురించి చెప్పి సింపతీ పొందాలని ప్రయత్నించలేదు. కానీ ఫ్యామిలీ ఎపిసోడ్‌లో కన్నతండ్రిని స్టేజీపై చూసి మాత్రం కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు.

ఇటీవలే తండ్రి మరణం
బిగ్‌బాస్‌ 9 ఫైనల్స్‌లోనూ తండ్రి క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌ కోసం రూ.15 లక్షల సూట్‌కేస్‌ తీసుకుని సెకండ్‌ రన్నరప్‌ స్థానంలో ఉండగా బయటకు వచ్చేశాడు. అతడొకటి తలిస్తే విధి మరొకటి తలిచింది. కొద్దిరోజుల క్రితమే పవన్‌ తండ్రి క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూశారు. ఈ బాధ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న పవన్‌.. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. టీవీ షోలలో పాల్గొంటున్నాడు. 

ట్రోలింగ్‌కు కౌంటర్‌
అయితే కన్నతండ్రిని కోల్పోయిన బాధే కనిపించడం లేదు, సంతోషంగా నవ్వుతూ పోస్టులు పెడుతున్నాడంటూ పవన్‌ను ట్రోల్‌ చేశారు. ఈ ట్రోలింగ్‌పై పవన్‌ స్పందించాడు. చాలామంది నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అయినా నేను మౌనంగానే ఉన్నాను. నా తప్పు లేకపోయినా సరే కొంతవరకు నెగిటివిటీని, ద్వేషాన్ని నేను భరించగలను. కానీ నావాళ్లను ఇబ్బందిపెడితే మాత్రం నాలోని డిమాన్‌ (రాక్షసుడు)ని చూస్తారు. వాడిని మీరు తట్టుకోలేరు.

మంచివాళ్లకే మంచివాడిని
చాలామంది తెలియకుండానే ఏదో ఒక పొరపాటు చేస్తారు. కానీ, తర్వాతైనా తమ తెప్పు తెలుసుకుని మారతారని భావిస్తున్నాను. అందుకే చాలామటుకు అన్నింటినీ క్షమించేసి, నేను ప్రశాంతంగా ఉంటాను. నేను మంచివాళ్లకే మంచివాడిని.. ఇప్పటికైనా ఈ ట్రోలింగ్‌ను ఆపేస్తారని భావిస్తున్నాను అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టాడు. ఇది చూసిన అభిమానులు.. మీరేంటో మాకు తెలుసు.. ట్రోలర్స్‌ను పట్టించుకోవద్దని కామెంట్లు చేస్తున్నారు.

 

 

చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వస్తున్న సినిమాలివే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement